వెయ్యబోవని తలుపు ..తియ్యమంటూ పిలుపు
దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు 1935 లో రచించిన భావ కవిత. బొడ్డుపల్లి సుబ్బలక్ష్మి గారి శ్రావ్యమైన గానాన్ని, దేవులపల్లి గారి మనవుడు అప్పారావు వింజమూరి గారు యూట్యూబ్ లో మన అందరి కోసం పంచారు. వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు రాధ కెందుకో నవ్వు గొలుపు నీలోన నాలోన నిదుర పోయే వలపు మేలుకొంటే లేదు తలుపు విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైతే వీధి వాకిలి ఏది చెల్లెలా విశ్వ విభుడే రాధ వెంట నంటి రాగ తలుపేది పిలుపేది చెల్లెలా అప్పారావు గారు అన్నట్లు ఈ పాట ఎక్కడా లేదు. మనం వినలేదు , విన్నా మర్చి పోయాము. చదివే వారు లేరు, పాడే వారు లేరు, వినే వారు లేరు.