స్వప్నదర్శనము
డా. లంకా సత్యనారాయణ రచించిన Vision ( Vennela Gangotri) కి స్వేచ్ఛానువాదం... అగమ్య గోచరమైన జీవనంలో, మసకబారిన కనులతో శోకతప్త భాష్పాలు కారని మనిషి ఎవడైనా ఉన్నాడా? కొండలలో కానలలో, జన సమూహంలో నిర్జిత ఎడారిలో వెతికాను వృధాగా. ఎచట చూసినా కన్నీటి ధారలతో తడిసి ముద్దైన మానవులే, ఎటు చూసినా నాకు కనపడేది జన సందోహం, బాధల భారంతో కాళ్ళు ఈడుస్తూ బ్రతుకు బరువు మోస్తూ. అన్నీ దిక్కులా కన్నాను దిక్కు తోచని మనుషులు విన్నాను శృతి మించిన పాటలు, గతి తప్పిన గీతాలు, తడబడే అడుగులు. ఓ భగవంత! నీ ప్రేమ సౌధం చేరాలని మనిషిని ఇలా సృజించావా? ఎంతో విడ్డురంగా స్వప్నాలలో అవధులు లేని విశ్వ సౌందర్యం జాలు వారగ మనిషి ప్రభాత భాస్కరుని తేజాన్ని రాగాలలో పులుముకున్నాడు యెడతెగని తన యానం వెలుగుల బాట అవ్వాలని. నువ్వేనా మా నుదుట ఈ వ్రాత రాసింది? చెప్పగలవా మా విధి ఈ విధంగా ఎందుకు మలచావో? ఓ భగవంత! ఎందుకు ఈ ప్రపంచాన్ని ఇంత మనోహరంగా సృష్టించి మనిషిని కోరికల అగ్ని కీలలలోకి నెట్టేసావు? అంతులేని అంతుచిక్కని అజ్ఞాత దూర తీరాలకు కొట్టుకుపోయాడు మనిషి, కడతేరని తీరని ఆశల అలల కడలిలో. తెగిన వీణా తంత్రులు తిరిగి...