మనసా నందమా నంద మాయే
Man Anand Anand Chayo కి స్వేచ్ఛనువాదం... మనసా నందమా నంద మాయే కడతేరగా గగనాన ఘనాంధకారం విప్పారిన కనుల సూరీడాయే మనసా నందమా నంద మాయే ఎగిసే అలల అందాల కిరణాలు గంగమ్మ ఒడిలోని పవిత్ర జలాలు అర్పించు వేళ ప్రతి సింగారం తేనెలొలుకు సింధూర గీతమై పాడెనే మనసా నందమా నంద మాయే మనసున పేరుకున్న పుట్టెడంత చింతలు కరిగి కన్నీళ్ళై చేతిన వర్షించగా అశృతుషారాలతో బిక్కు బిక్కు నున్న ప్రతి రోమము రొమ్ము విప్పి నవ్వేనే మనసా నందమా నంద మాయే మానస సరోవరం కల్లోల మగ్నం నవదర్పణం తొంగి చూడగా పాశం నాశం లేనిదై అర్థనిమీలిత నేత్రాలతో ప్రాణ హంస తరలి వచ్చెనే మనసా నందమా నంద మాయే