సుదీర్ఘ యానం
నా ప్రాణ స్నేహితుడు గురు ప్రకాష్ నాలుగు రోజులు క్రితం తాను వ్రాసిన ఆంగ్ల పద్యం All these years నాకు పంపించాడు. అతని పద్య కౌసల్యం నన్ను అబ్బుర పరచింది. సమవయస్కులం కావడం వల్ల అతని ఆలోచనలు నన్ను ప్రేరేపింప చేసాయి. అతని పద్యాన్ని కింద స్వేఛ్చనువాదం చేశాను. అనువాదం లో తప్పులు నావి ఒప్పులు మరియు భావాలూ నా మిత్రుడివి. సుదీర్ఘ యానం ( translated from English. For the original by Guru Prakash click All these years ) దాగి ఉన్నావు పదాల మధ్య కానీ సుదీర్ఘ యానంలో గుర్తించలేదు నిన్ను ఏ వాక్యంలో స్తంభించావు ఉచ్వాసనిశ్వాసల సంధిలో కానీ సుదీర్ఘ యానంలో దక్క లేదు నీ అనుభూతి ఏనాడు నుంచున్నావు నా ప్రియ సంగీతఝరులలో నిశ్శబ్దంగా కానీ సుదీర్ఘ యానంలో సరిగమల అలజడిలో నీ ఒడిని వదిలేసి శూ న్యుడనయ్యాను అనంత విశ్వంలో ఆణువణువూ జీవించే అవధి లేని కుటీరం నువ్వు కానీ సుదీర్ఘ యానంలో జిలుగు వెలుగుల వేటలో వెతికాను నీ లేమి కోసం సర్వ జీవాజీవ కోటిని కదిలించే శక్తివి నువ్వు కానీ సుదీర్ఘ యానంలో భౌతిక ప్రపంచంలో అందుకోలేనంతగా నిగూఢమయ్యావు ఈ సుదీర్ఘ యాన...