ఓ విభావరీ! ఓహో విభావరీ!
ఓ విభావరీ! ఓహో విభావరీ! - డా.బాలాంత్రపు రజనీకాంతరావు -తాత్పర్యంలో మరియు ఆంగ్ల అనువాదంలో తప్పులు మీ విధేయుడివి ఓ విభావరీ! ఓహో విభావరీ! నీహార హీర నీలాంబర ధారిణీ, మనోహారిణీ!! నీ చంచల చేలాంచల నిభృత స్వప్న సీమలలో ఏలా భయచ్ఛాయాజాల మేలా సౌఖ్యరోచిర్లీల!! ఓ విభావరీ! ఓహో విభావరీ!! సంతత శాంతతరంగిణి మదభరయువకురంగిణి ఏలా యలసగమనమ్ము ఏలా నవవిలసనమ్ము!! ఓ విభావరీ! ఓహో విభావరీ!! ధరణీతలచంద్రశిలా తరళమంటపమున నిలిచి యుగములుగ పరిభ్రమింతు నగమ్యుడౌ యెవని వలచి!! ఓ విభావరీ! ఓహో విభావరీ!! కవి రాత్రి గురించి వర్ణిస్తున్నారు. విభావరి, తెల్లటి మంచు రత్నంలా ఉంది నీమీద. చీకటిని నల్లటి చీర లాగా ధరించావు, మనసు దోచావు. రెపరెపలాడే నీ కోక అంచులలో నిశ్చలమైన కలల సామ్రాజ్యం ఉంది. సుఖమయ కాంతులు వెదజల్లే ఆ చోట మరింకెందుకు ఆ భయం? ఓ రేయి, నిరంతరం పారే శాంతమైన నదివి నీవు. మదోన్మత్తమైన వయసులో ఉన్న జింకవి నీవు. అయినా ఎందుకు ఈ వడిలేని అడుగులు? ఏంటీ క్రొత్త కేళి? ఓ నిశా వనితా, చంద్రునికాంతిలో మెరిసిపోయే భూమి అనే రత్న మంటపం మీద నిలబ...