ఓ విభావరీ! ఓహో విభావరీ!
ఓ విభావరీ! ఓహో విభావరీ!
- డా.బాలాంత్రపు రజనీకాంతరావు
-తాత్పర్యంలో మరియు ఆంగ్ల అనువాదంలో తప్పులు మీ విధేయుడివి
ఓ విభావరీ! ఓహో విభావరీ!
నీహార హీర నీలాంబర
ధారిణీ, మనోహారిణీ!!
నీ చంచల చేలాంచల
నిభృత స్వప్న సీమలలో
ఏలా భయచ్ఛాయాజాల
మేలా సౌఖ్యరోచిర్లీల!!
ఓ విభావరీ! ఓహో విభావరీ!!
సంతత శాంతతరంగిణి
మదభరయువకురంగిణి
ఏలా యలసగమనమ్ము
ఏలా నవవిలసనమ్ము!!
ఓ విభావరీ! ఓహో విభావరీ!!
ధరణీతలచంద్రశిలా
తరళమంటపమున నిలిచి
యుగములుగ పరిభ్రమింతు
నగమ్యుడౌ యెవని వలచి!!
ఓ విభావరీ! ఓహో విభావరీ!!
కవి రాత్రి గురించి వర్ణిస్తున్నారు. విభావరి, తెల్లటి మంచు రత్నంలా ఉంది నీమీద. చీకటిని నల్లటి చీర లాగా ధరించావు, మనసు దోచావు. రెపరెపలాడే నీ కోక అంచులలో నిశ్చలమైన కలల సామ్రాజ్యం ఉంది. సుఖమయ కాంతులు వెదజల్లే ఆ చోట మరింకెందుకు ఆ భయం? ఓ రేయి, నిరంతరం పారే శాంతమైన నదివి నీవు. మదోన్మత్తమైన వయసులో ఉన్న జింకవి నీవు. అయినా ఎందుకు ఈ వడిలేని అడుగులు? ఏంటీ క్రొత్త కేళి? ఓ నిశా వనితా, చంద్రునికాంతిలో మెరిసిపోయే భూమి అనే రత్న మంటపం మీద నిలబడి ఉన్నావు. యుగ యుగాలుగా పరిభ్రమిస్తున్నావు. దొరకని ఎవరి గురించి? ఎవరిని వలచి?
O night! O darkness wrapping thyself over light!
Bedecked with glittering mist are you, a black vestment
adorning, you steal mine heart!!
In thine fluttering sari's
unwavering lands of dream
whence the shadows of fear
cast a net, comfort is in thee bosom's illumination!!
O night! O darkness wrapping thyself over light!
Forever a stream of tranquility are you
Drunk with passion, a youthful antelope is you
why then this lazy saunter?
for what this newfangled dalliance
O night! O darkness wrapping thyself over light!
On the face of earth, in the moonstone
palace of cool brightness, you wistfully stand
for eons circumambulating
paths alas beyond reach, why, who have thee loved!!
O night! O darkness wrapping thyself over light!
Super
ReplyDeleteఅద్భుతం ��
ReplyDeleteశతకోటి వందనాలు పవన్ గారు