నెయ్యములల్లో నేరేళ్ళో
నెయ్యములల్లో నేరేళ్ళో -- అన్నమాచార్య కీర్తన -- క్రింద తాత్పర్యంలో తప్పులు ఉంటే క్షమించి తప్పు సవరించగలరు. పల్లవి: నెయ్యములల్లో నేరేళ్ళో వొయ్యన వూరెడి వువ్విళ్ళో చరణములు: పలచని చెమటల బాహుమూలముల చెలమలలోనాఁ జెలువములే థళథళమను ముత్యపుఁ జెఱఁగు సురటి దులిపేటి నీళ్ళ తుంపుళ్ళో తొటతొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ చిటి పొటి యలుకల చిరునగవే వట ఫలంబు నీ వన్నెల మోవికి గుటకల లోనా గుగ్గిళ్ళో గరగరికల వేంకటపతి కౌఁగిట పరిమళములలో బచ్చనలు (లే) మరునివింటి కమ్మనియంప విరుల గురితాఁకు లినుప గుగ్గిళ్ళో కష్టమైనా పదాలకు అర్ధాలు: నెయ్యము = స్నేహము, ప్రేమ, ఇంపు అల్లో నేరేళ్ళు = కాముని పున్నమికి స్త్రీలు ఆడే కోలాటం ఒయ్యన = నెమ్మదిగా, వయ్యారంగా చెలమ = ఊట; తవ్వబడిన పల్లము చెలువము = అందము చెరగు = అంచు; కొంగు సురటి = విసిన కఱ్ఱ తొరుగు = ప్రవహించు; కారు; పడు నగవు = నవ్వు వట = మఱ్ఱి చెట్టు వన్నె = రంగు, అందము మోవి = పెదవి గరగరికల = చక్కదనం; అందం బచ్చన = పూత; పూయడం మరుడు = మన్మథుడు వింటి = విల్లు కమ్మని = ఆహ్లాదకరమైన; తీపి అంప = బాణము విరి = పుష్పము; వికసించినది తాత్పర్యము అన్నమయ్య ఊహించిన గొప్ప శృంగార దృ...