Posts

Showing posts from June, 2025

వేలకొద్ది ఆశలు అలాటివి

  గాలిబ్  (1797 - 1869)  రచించిన ఘజల్    హజారోన్ క్వాహిషే ఏసీ   కి స్వేచ్ఛానువాదం...        వేలకొద్ది ఆశలు అలాటివి,  ప్రతీ ఆశకై అది తుది శ్వాస  అయ్యింది     ఎన్నో తీరాయి నా కోరికలు అయినా తిరిగి కొంత తక్కువ అయ్యింది     భయం ఎందుకు ప్రియ ఘాతి, ఇంక ఏముంటుంది నా కంఠంలో     ఆ రక్తం ధారలుగా ప్రతి రోజూ ప్రతి ఊపిరిలో కన్నీరు అయ్యింది     కూడబెట్టిన పుణ్యం నిండుకుంటే, తిరిగి మానవ జన్మే, వింటూనే ఉన్నాం ఇదేదో     కాలరాసే అవమానాలు క్రమ్ముకుంటే నీ వీధిలో నా బ్రతుకు చీకటి అయ్యింది     అందనంత ఎత్తులో ఉన్నావని విర్రవీగకు, నేల జారగలవు త్రుటిలో       కొప్పు ముడి వీడినంతనే అందాల నీ కురుల నిడివి తెల్లము అయ్యింది     అయినా తనకి లేఖ వ్రాయాలంటే ఎవరైనా, వ్రాయించుకోండి నాతో     ప్రొద్దు పొడుస్తూనే కలం చెవిలో పెట్టుకుని బయలుదేరడం అయ్యింది     మధువు తాగుతానని పేరుబడింది నాకు, ఈ ఝాములో ఈ ఊరులో     మళ్ళీ లోకంలో సురామృత కలశం మధించే  స...

మట్టి

   టి ఎస్ ఎలియట్ (1888 - 1965)  రచించిన కవిత    ది రాక్ (1934)   కి స్వేచ్ఛానువాదం...        గగన సీమలలో పక్షిరాజు పైకెగిసింది     వేటగాడు జాగిలాలతో పాటు సంచారం చేస్తున్నాడు     ఓ చుక్కల నిత్య భ్రమణమా     ఓ ఋతువుల నిర్ధేశిత పునరావృతమా     ఓ వసంత శిశిరాల, జనన మరణాల ప్రపంచమా     అంతులేని వలయం ఈ తలపు ఈ కర్మ,     అంతులేని కల్పన, అంతులేని శోధన,  తెస్తాయి     ఎరుక చలనాల గూర్చి, కానీ అందదు నిశ్చలత్వం     ఇస్తాయి వాగ్విద్య, కానీ  వినబడదు నిశ్శబ్దంలో నిర్దేశం     మాటల అర్థం అందుతుంది, కానీ శృతి తెలియని అజ్ఞానం మిగులుస్తుంది     మన విషయ జ్ఞానం మనల్ని మరింత దరికి చేరుస్తుంది అజ్ఞానానికి     మన అజ్ఞానం మరలుస్తుంది మర్త్యుని దగ్గరకు     మృత్యువు వడి లోకేగాని, బ్రహ్మైక్య ఆనందంలోకి కాదు.     ఎక్కడా జీవితం బ్రతకడంలో ఖర్చు అయిపోయినది ?      ఎక్కడ ఆ వివేకం, శాస్త్ర పరిజ్ఞానంలో కోల్పోయినది ?    ...