Posts

Showing posts from March, 2026

స్వప్నదర్శనము

  డా. లంకా సత్యనారాయణ  రచించిన   Vision (  Vennela Gangotri)   కి స్వేచ్ఛానువాదం...   అగమ్య గోచరమైన జీవనంలో, మసకబారిన కనులతో శోకతప్త భాష్పాలు కారని మనిషి ఎవడైనా ఉన్నాడా? కొండలలో కానలలో, జన సమూహంలో నిర్జిత ఎడారిలో వెతికాను వృధాగా. ఎచట చూసినా కన్నీటి ధారలతో తడిసి ముద్దైన మానవులే, ఎటు చూసినా నాకు కనపడేది జన సందోహం, బాధల భారంతో కాళ్ళు ఈడుస్తూ బ్రతుకు బరువు మోస్తూ. అన్నీ దిక్కులా కన్నాను దిక్కు తోచని మనుషులు విన్నాను శృతి మించిన పాటలు, గతి తప్పిన గీతాలు, తడబడే అడుగులు. ఓ భగవంత! నీ ప్రేమ సౌధం చేరాలని మనిషిని ఇలా సృజించావా? ఎంతో విడ్డురంగా స్వప్నాలలో అవధులు లేని విశ్వ సౌందర్యం జాలు వారగ మనిషి ప్రభాత భాస్కరుని తేజాన్ని రాగాలలో పులుముకున్నాడు యెడతెగని తన యానం వెలుగుల బాట అవ్వాలని. నువ్వేనా మా నుదుట ఈ వ్రాత రాసింది? చెప్పగలవా మా విధి ఈ విధంగా ఎందుకు మలచావో? ఓ భగవంత! ఎందుకు ఈ ప్రపంచాన్ని ఇంత మనోహరంగా సృష్టించి మనిషిని కోరికల అగ్ని కీలలలోకి నెట్టేసావు? అంతులేని అంతుచిక్కని అజ్ఞాత దూర తీరాలకు కొట్టుకుపోయాడు మనిషి, కడతేరని తీరని ఆశల అలల కడలిలో. తెగిన వీణా తంత్రులు తిరిగి...

మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు

  కైఫీ అజ్మి  రచించిన   Aurat   కి స్వేచ్ఛానువాదం...   మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు యుద్ధ జ్వాలలు రగులుతున్నాయి ప్రపంచంలో నేడు నుదుటి రాతలూ, కాలం పరుగులు, కలిసి పంచుకున్నాయి ఒకే ఆశలు నేడు మదిర పాత్రలో మధువు మరుగుతోంది అగ్నిపర్వతంలా నేడు సౌందర్యము ప్రేమము ఒకే ప్రాణం ఒకే ఆత్మ అయ్యే నేడు ఏ అగ్ని జ్వాలలలో నేను తప్తమవుతున్నానో తప్తమవ్వాలి నువ్వు మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు జీవితం పోరాటంలో ఉంది, ఓర్పుల నిగ్రహంలో కాదు పరవళ్లు తొక్కే బ్రతుకు రక్తంలో ఉంది, బెదిరిన కన్నీటిలో కాదు చేతులు చాచి ఎగరడంలో గుబాళింపు ఉంది, నీ నల్లని కురులలో కాదు స్వర్గం వేరొకటి ఉంది, మగని పక్కన కాదు ఆ స్వతంత్రపు వీధులలో స్వేచ్ఛగా విహరించాలి నువ్వు మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు దిక్కు దిక్కునా చితాగ్నులు మండుతున్నాయి నీ కోసం కర్తవ్యం అన్న ముసుగులో మృత్యువు మసులుతోంది నీ కోసం దయతో కోమలంగా నువ్వు చేసే పనులన్నీ, అవుతాయి శాపం నీ కోసం కాలకూటపు విషం, అవుతాయి ప్రపంచపు గాలులు నీ కోసం ఋతువునే మార్చేయ్యి, ఎదగాలంటే విప్పరాలంటే నువ్వు మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వ...