Posts

Showing posts from October, 2026

మరునాడు, మరునాడు, మరునాడు

  విలియం షేక్‌స్పియర్   రచించిన   Macbeth   లో  Tomorrow, and tomorrow, and tomorrow" అనే soliloquy నుంచి      మరునాడు, మరునాడు, మరునాడు     ఎగబ్రాకుతుంది క్షుద్రమైన గతిలో రోజూ ప్రతి రోజు     కాలం అంతమయ్యే దాకా ఆ కథ చివరి అక్షరం దాకా     మనవైన నిన్నలన్నీ వెలిగించాయి మూర్ఖుల     గమనం మసకబారిన మృత్యు ద్వారం వరకూ. తరిగిపోతున్న దీపమా ఓ మారు ఆగిపో!     బ్రతుకు ఒక నడిచే నీడ, దీనమైన ఒక వేషగాడు అది     రంగస్థలం పై ఉన్న కొద్ది సమయంలో విర్రవీగుతూ నిట్టూరిస్తూ,     అంతమయ్యాక మరల కనబడక వినబడక. బ్రతుకు ఓ గాథ     వెఱ్ఱివాడు చెప్పే ఉత్తి గాథ, అంతా ఆర్భాటం నిండా ఆవేశం,     అర్థం లేదు దానికి, అర్థం అసలు లేదు దానికి.     -- మక్‌బెత్, విలియం షేక్‌స్పియర్