Posts

Showing posts from May, 2020

సత్యంగారిల్లెక్కడ?

"విషాన్ని విషంగా  గుర్తించడానికి ఇష్టపడని వాళ్ళకి అది విషం అని చెప్పడం వృధా."  నార్వేకి చెందిన నాటకాల రచయిత హెన్రిక్ ఇబ్సెన్ 1882 లో రచించిన నాటిక "యాన్ ఎనిమి అఫ్ ది పీపుల్ " ని పంతొమ్మిది వందల అరవైల్లో గొల్లపూడి మారుతీ రావుగారు తెలుగు రంగస్థలం కోసం "సత్యంగారిల్లెక్కడ" గా అనువర్తించారు. సత్యజిత్ రాయ్ ఇబ్సెన్ నాటికని ఘనశత్రు పేరుతో 1990 లో సినిమాగా తీశారు. గొల్లపూడి గారి నాటికని ఈరోజు మళ్ళీ చదివాను. ఆ నాటిక లో ముఖ్య పాత్ర అయిన డా:సత్యం సత్యం కోసం తన జీవితం మొత్తం పణంగా పెట్టి అన్నీ కోల్పోతాడు. అతని ఆవేదనని మారుతీ గారు పై పదాలలో మనకి చెప్పించారు. ఈ నాటిక ఈనాటికి ఏనాటికి అయినా అద్దం పడుతుంది. కుట్రలు కుతంత్రాలు తో మకిల పడిన సమాజం , దానిని తమ స్వప్రయోజనాల కోసం వంచించే రాజకీయ నాయకులు, అజ్ఞానంతో తోలు బొమ్మల లాగా వాళ్ళ చేతిలో ఆయుధాలు అయ్యే అమాయక ప్రజలు, వీళ్లందరి నడుమ సత్యం కోసం నిలబడిన డాక్టర్ సత్యం ఈ నాటిక కథాంశం. డాక్టర్ గారి మావగారు ఆ ఊరి చైర్మన్. ఊరిలో అందరినీ  అంతుపట్టని వ్యాధి పీడిస్తుంది. సత్యం అహోరాత్రులు కష్టపడి దానికి కారణం, నాలుగు ఏళ్ళు క్రిత...

విచిత్ర గ్రంధాలయం

-- హరుకి మురకామి రచించిన జాపనీస్ పుస్తకం "ది స్ట్రేంజ్ లైబ్రరీ" యొక్క స్వేచ్చానువాదం (1) గ్రంధాలయం యెప్పటి కన్నా నిశ్సబ్ధం గా ఉంది. నా కొత్త తోలు బూట్లు నేల మీద టక్ టక్ శబ్ధం చేస్తున్నాయి. పొడిగా గట్టిగా ఉన్న ఆ శబ్ధం నా మామూలు అడుగులకి భిన్నంగా ఉంది. కొత్త బూట్లు కొన్నప్పుడల్లా ఆ చప్పుడు అలవాటు అవ్వడానికి నాకు కొన్నాళ్లు పడుతుంది. ఇంతకు మునుపెన్నడూ చూడని ఒకావిడ, పుస్తకాలు అరువు ఇచ్చే విభాగంలో కూచుని ఉంది. ఆవిడ చాలా పెద్దగా వెడల్పుగా ఉన్న ఒక పుస్తకం చదువుతోంది. కుడి పక్క పుట కుడి కంటితో యెడమ పక్క పుట యెడమ కంటితో చదువుతున్నట్లు ఉంది.  “మేడమ్” అని ఆవిడిని పిలిచాను. పుస్తకాన్ని గట్టిగా మూసి ఆవిడ నా వైపు చూసింది. "ఈ పుస్తకాలు వెనక్కి ఇవ్వడానికి వచ్చాను" అంటూ పుస్తకాల్ని ఆవిడ ముందు బల్ల మీద పెట్టాను. అందులో ఒకటి "హౌ టు బిల్డ్ ఏ సబ్మెరైన్", ఇంకోటి "మెమొయిర్ ఆఫ్ ఏ షెపర్డ్". ఆవిడ పుస్తకాలు తెరిచి వెనక్కి తిరిగి ఇవ్వవలిసిన తేదీ చూసింది. తిరిగి ఇవ్వడానికి ఇంకా వ్యవధి ఉంది. నేను యెప్పుడూ సమయాతీతంగా ఇవ్వను. మా అమ్మ నాకు...