సత్యంగారిల్లెక్కడ?
"విషాన్ని విషంగా గుర్తించడానికి ఇష్టపడని వాళ్ళకి అది విషం అని చెప్పడం వృధా."
నార్వేకి చెందిన నాటకాల రచయిత హెన్రిక్ ఇబ్సెన్ 1882 లో రచించిన నాటిక "యాన్ ఎనిమి అఫ్ ది పీపుల్ " ని పంతొమ్మిది వందల అరవైల్లో గొల్లపూడి మారుతీ రావుగారు తెలుగు రంగస్థలం కోసం "సత్యంగారిల్లెక్కడ" గా అనువర్తించారు. సత్యజిత్ రాయ్ ఇబ్సెన్ నాటికని ఘనశత్రు పేరుతో 1990 లో సినిమాగా తీశారు.
గొల్లపూడి గారి నాటికని ఈరోజు మళ్ళీ చదివాను. ఆ నాటిక లో ముఖ్య పాత్ర అయిన డా:సత్యం సత్యం కోసం తన జీవితం మొత్తం పణంగా పెట్టి అన్నీ కోల్పోతాడు. అతని ఆవేదనని మారుతీ గారు పై పదాలలో మనకి చెప్పించారు.
ఈ నాటిక ఈనాటికి ఏనాటికి అయినా అద్దం పడుతుంది. కుట్రలు కుతంత్రాలు తో మకిల పడిన సమాజం , దానిని తమ స్వప్రయోజనాల కోసం వంచించే రాజకీయ నాయకులు, అజ్ఞానంతో తోలు బొమ్మల లాగా వాళ్ళ చేతిలో ఆయుధాలు అయ్యే అమాయక ప్రజలు, వీళ్లందరి నడుమ సత్యం కోసం నిలబడిన డాక్టర్ సత్యం ఈ నాటిక కథాంశం.
డాక్టర్ గారి మావగారు ఆ ఊరి చైర్మన్. ఊరిలో అందరినీ అంతుపట్టని వ్యాధి పీడిస్తుంది. సత్యం అహోరాత్రులు కష్టపడి దానికి కారణం, నాలుగు ఏళ్ళు క్రితం వేసిన నీటి సరఫరా గొట్టాలను మురికి నీరు గొట్టాలు కలుషితం చేయడమే అని నిర్ధారిస్తాడు. కానీ మావగారు ఇది బయటపడితే ఎన్నికల్లో చుక్కెదురు అవుతుందని ఎగస్ పార్టీ కౌన్సెలర్స్ తో కుమ్మకై అల్లుడి మీద పన్నాగం పన్నుతాడు.
సత్యం గారి అనుచరుడు డా:రామం అయన కుమార్తె శశి మీద ప్రేమ వొలకపోస్తూనే, ధన వ్యామోహంతో ఆయనకి ఎదురు తిరుగుతాడు. గొట్టాల విషయం బట్టబయలు చెయ్యడానికి సభ ఏర్పాటు చేస్తే ఆయననే మాట్లాడకుండా జనం రాళ్లు రువ్వుతారు. ఆ తరుణం లో అయన సోక్రటీస్ కి విషం ఇచ్చి చంపారని, జ్ఞానం లేని ప్రజాస్వామ్యానికి సత్యం తల ఒంచక తప్పదని వాపోతాడు.
మారుతీ గారు పాత్రలను యెంతో సజీవంగా సృష్టించారు. ఇంటి యజమాని హరిదాసు ఊరిలో కథలు చెప్పుకుని పొట్ట నింపుకోవడం కోసం నాయకుల తో మాటలు పడడం, దాసుని ప్రజలు రెచ్చిపోయేలా తన గురించి కథలు చెప్పమనే మెజారిటీ కౌన్సిలర్ పెంచలయ్య, పావలా మందు ఇరవై రూపాయలకి అమ్ముదామనే మందుల కంపెనీ యజమాని మైనారిటీ కౌన్సిలర్ వీర్రాజు, అటు తండ్రికి ఇటు భర్తకి మధ్య నలిగిపోయే మహాఇల్లాలు పార్వతి, నాన్న ఆదర్శాలు ని పూర్తిగా ఆకళింపు చేసుకుని తుది వరకు అండగా నిలిచి సర్వసం కోల్పోయి జీవచ్ఛవం అయిన కూతురు శశి, పదవి కోసం కన్న కూతురి జీవితాన్నే నాశనం చేసిన పశుపతి, ఇలా అన్ని పాత్రలు కళ్ళకి కట్టినట్టు గా ఉంటాయి.
నాటికలో కొన్ని డైలాగ్స్ మచ్చుకకి
ఆఖరి సీన్ లో డా; సత్యం ఊరు వదిలి వెళ్లిపోతుంటే దాసు అడుగుతాడు సత్యంగారిల్లెక్కడ అంటే యేమని చెప్పమన్నారు అని?
దానికి ఆయన సమాధానం - "మనిషి మనిషిగా బ్రతక గలిగిన చోట, మనిషిని మనిషే తినడం మరగని చోట సత్యానికి చల్లని నీడ ఉంటుంది. అక్కడ పచ్చటి గూడు కట్టుకుని బ్రతుకుతాం."
ఆ మాటలతో తెర పడుతుంది. ఆ తెర నాటకానికి గాని సత్యానికి కాదని తలుస్తూ సత్యాన్వేషణ మన జీవితాశయం కావాలని ఆశిస్తున్నాను.

- కంటికి కనపడనివన్నీ ఉన్నాయి అని నిరూపించవచ్చుకానీ ఈ లోకంలో మెజారిటీ లేనిదే ఏ పని జరగదు - ఈనాటి ఫేక్ న్యూస్! విజ్ఞానం వివేకం లేని ప్రజాస్వామ్యం అనర్ధాలకి హేతువు
- వ్యక్తి నాశనం అయ్యాక ఇంక వ్యవస్థ ఏమిటి? - మెజారిటీ పేరుతో వ్యక్తి యొక్క విలువలను స్వేచ్ఛలను చెరిపి వెయ్యడం గురించి
- పదిమంది ఉద్రేకాల మధ్య ఉక్కబోసి నిజం ఉరి పోసుకుంది
- పాము విషం తలకెక్కాక కాళ్ళకి కట్టు కట్టడం అనవసరం
దానికి ఆయన సమాధానం - "మనిషి మనిషిగా బ్రతక గలిగిన చోట, మనిషిని మనిషే తినడం మరగని చోట సత్యానికి చల్లని నీడ ఉంటుంది. అక్కడ పచ్చటి గూడు కట్టుకుని బ్రతుకుతాం."
ఆ మాటలతో తెర పడుతుంది. ఆ తెర నాటకానికి గాని సత్యానికి కాదని తలుస్తూ సత్యాన్వేషణ మన జీవితాశయం కావాలని ఆశిస్తున్నాను.
Comments
Post a Comment