విచిత్ర గ్రంధాలయం
(1)
గ్రంధాలయం యెప్పటి కన్నా నిశ్సబ్ధం గా ఉంది. నా కొత్త తోలు బూట్లు నేల మీద టక్ టక్ శబ్ధం
చేస్తున్నాయి. పొడిగా గట్టిగా ఉన్న ఆ శబ్ధం నా మామూలు అడుగులకి భిన్నంగా ఉంది. కొత్త బూట్లు
కొన్నప్పుడల్లా ఆ చప్పుడు అలవాటు అవ్వడానికి నాకు కొన్నాళ్లు పడుతుంది. ఇంతకు మునుపెన్నడూ
చూడని ఒకావిడ, పుస్తకాలు అరువు ఇచ్చే విభాగంలో కూచుని ఉంది. ఆవిడ చాలా పెద్దగా వెడల్పుగా
ఉన్న ఒక పుస్తకం చదువుతోంది. కుడి పక్క పుట కుడి కంటితో యెడమ పక్క పుట యెడమ కంటితో
చదువుతున్నట్లు ఉంది.

“మేడమ్” అని ఆవిడిని పిలిచాను.
పుస్తకాన్ని గట్టిగా మూసి ఆవిడ నా వైపు చూసింది.
"ఈ పుస్తకాలు వెనక్కి ఇవ్వడానికి వచ్చాను" అంటూ పుస్తకాల్ని ఆవిడ ముందు బల్ల మీద పెట్టాను.
అందులో ఒకటి "హౌ టు బిల్డ్ ఏ సబ్మెరైన్", ఇంకోటి "మెమొయిర్ ఆఫ్ ఏ షెపర్డ్". ఆవిడ పుస్తకాలు తెరిచి
వెనక్కి తిరిగి ఇవ్వవలిసిన తేదీ చూసింది. తిరిగి ఇవ్వడానికి ఇంకా వ్యవధి ఉంది. నేను యెప్పుడూ
సమయాతీతంగా ఇవ్వను. మా అమ్మ నాకు అలాగ నేర్పింది. గొర్రె కాపారులు కూడా అంతే. సమయానికి
కట్టుబడక పోతే గొర్రెలు కకావికలు అయిపోతాయి.

"రిటర్న్డ్" అని లైబ్రేరియన్ ముద్ర వేసి మళ్ళీ తన పుస్తకంలో మునిగిపోయింది.
"నేను కొన్ని పుస్తకాల కోసం వెదుకుతున్నాను" గొంతు సవరించుకుని ఆవిడతో అన్నాను.
"మెట్లు దిగి కుడి పక్కకి వెళ్ళు" అని సమాధానం ఇచ్చింది, తల పైకి యెత్తకుండానే.
"తిన్నగా గది నెంబర్ 107 కి వెళ్ళు".
"మెట్లు దిగి కుడి పక్కకి వెళ్ళు" అని సమాధానం ఇచ్చింది, తల పైకి యెత్తకుండానే.
"తిన్నగా గది నెంబర్ 107 కి వెళ్ళు".
(2)
యెంత దిగినా తరగని మెట్లని దిగి, కుడి పక్కకి తిరిగి ఇరుకుగా ఉన్న నడవలో అడుగులు వేస్తో చివరికి
107 అని రాసి ఉన్న ఒక తలుపు దగ్గరకు చేరాను. నేను గ్రంధాలయంకి చాలా సార్లు వచ్చినా ఇక్కడ నేల
కింద ఒక గది ఉండడం నాకు ఆశ్చర్యం కలిగించింది. తలుపు తట్టాను. మామూలుగా రోజువారీ తట్టినట్టే
తట్టినా, అది క్రికెట్ బ్యాట్ తో నరకం తలుపులు యెవరో బాదినంత శబ్దం చేసింది. ఆ నడవిలోంచి
భయంకరమైన ప్రతిధ్వని వెలువడింది. మరుక్షణం పరిగెట్టటానికి వెనక్కి తిరిగాను. కానీ ఒక్క అడుగు
కూడా వేయలేదు. మా అమ్మ నన్ను అలాగ పెంచలేదు. తలుపు తడితే దానిని యెవరైనా తీసేవరకు
ఆగాలని మా అమ్మ నేర్పింది.

"లోపలికి రండి" లోపలి నుంచి, చిన్నగా కానీ ధృడంగా ఉన్న, ఒక గొంతు పిలిచింది.
నేను తలుపు తీశాను. గది మధ్యలో, పాత బల్ల వెనకాల ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు. ఈగలు
ముసిరినట్టు ఆయన మొహం మొత్తం మీద నల్లటి మచ్చలు ఉన్నాయి. బట్ట తల కి తోడు దళసరి
భూతద్దాలు పెట్టుకుని ఉన్నాడు. నున్నటి బట్టతల మీద రెండు వైపులా తెల్లటి రోమాలు అతికించినట్టు
ఉన్నాయి. దావానలం తర్వాత మిగిలే మొండి కొండ గుర్తుకు వచ్చింది.

"స్వాగతం చిన్నవాడా, నీకు యేమి సహాయం చేయగలను? " అన్నాడు ముసలాయన.
"పుస్తకాల కోసం వెదుకుతున్నాను. కానీ మీరు పనిలో ఉన్నట్టు ఉన్నారు, నేను మళ్ళీ వస్తాను" బింకంగా
పలికాను.
పలికాను.
"భలే వాడివే! ఇది నా ఉద్యోగం - ఎలాంటి పుస్తకాలు కావాలో చెప్పు. అవి నీ కోసం నేను వెతుకుతాను."
అతని మాటలు, మొహం, చెవి వెనక నుంచి నిక్కబొడుచుకొచ్చే వెంట్రుకలు అన్నీ వింత గా ఉన్నాయి.
దవడల కింద చర్మం ముడతలు పడి చిరిగి పోయిన బుడగ వలే వేళ్లాడుతోంది.
దవడల కింద చర్మం ముడతలు పడి చిరిగి పోయిన బుడగ వలే వేళ్లాడుతోంది.
"దేనికోసం చూస్తున్నావబ్బాయ్?"
"ఒట్టోమన్ సామ్రాజ్యం లో పన్నులు ఎలాగ వసూలు చేసేవారో తెలుసుకుందామనుకుంటున్నాను"
సమాధానం ఇచ్చాను.
సమాధానం ఇచ్చాను.
అతని కళ్ళు మెరిసాయి. "భళా, ఒట్టోమన్ సామ్రాజ్యంలో పన్నుల వసూలు. అంత కంటే ఆసక్తికరమైన
అంశం ఉంటుందా!"
అంశం ఉంటుందా!"
అయిష్టంగా తల ఊపాను. నిజానికి ఆ విషయం గురించి తెలుస్కోడానికి నాకు పెద్ద ఆసక్తి యేమీ లేదు.
బడి నుంచి ఇంటికి వెళ్తుంటే ఒట్టోమన్ వసూళ్ల గురించి స్పురించింది. అంతే. చిన్ననాటి నుంచి మా
అమ్మ చెప్పేది , యేమన్నా తెలియకపోతే గ్రంధాలయం వెళ్ళి తెలుసుకోవాలి.
బడి నుంచి ఇంటికి వెళ్తుంటే ఒట్టోమన్ వసూళ్ల గురించి స్పురించింది. అంతే. చిన్ననాటి నుంచి మా
అమ్మ చెప్పేది , యేమన్నా తెలియకపోతే గ్రంధాలయం వెళ్ళి తెలుసుకోవాలి.
"పర్వాలేదు అండి, అంత ముఖ్యమైన విషయం కాదు. ఆ అంశం కేవలం పుస్తక జ్ఞానమే కదా..." తొందరగా
ఆ భయం కలిగించే ప్రదేశం నుంచి వెళ్లిపోవాలి అనుకున్నాను.
ఆ భయం కలిగించే ప్రదేశం నుంచి వెళ్లిపోవాలి అనుకున్నాను.
"నాతో పరాచకాలు ఆడకు" కసిరాడు అతను. "మా దగ్గర అలాంటివి చాలా పుస్తకాలు ఉన్నాయి.
లైబ్రరి లో పరిహాసాలు కోసం వచ్చావా?"
లైబ్రరి లో పరిహాసాలు కోసం వచ్చావా?"
"లేదు అండి.." తడబడుతూ చెప్పాను. "నేను యెవరినీ ఆట పట్టించట లేదు".
"అయితే మంచి బాలుడి లాగా ఇక్కడే వేచి ఉండు".
"సరేనండి".
కుర్చీ నుంచి లేచి వంగిన నడుముతో నిమ్మదిగా వెనకాల ఉన్న ఇనుప తలుపు తోసుకుని మాయం
అయిపోయాడు. పది నిమిషాలు అక్కడే అతని కోసం ఆగాను. నాకు తోడుగా నల్లటి పురుగులు, దీపం కింద
కిర్రు కిర్రుమని రొద పెడుతున్నాయి.
అయిపోయాడు. పది నిమిషాలు అక్కడే అతని కోసం ఆగాను. నాకు తోడుగా నల్లటి పురుగులు, దీపం కింద
కిర్రు కిర్రుమని రొద పెడుతున్నాయి.
యెట్టకేలకు మూడు బండ పుస్తకాలు మోసుకుని వచ్చాడు. అవి చాలా పాతగా ఉన్నాయి. పాత వాసన గదిని
ఆవరించుకుంది.
ఆవరించుకుంది.
"ఇదిగో నీ పుస్తకాల విందు" అంటూ గర్వంగా చూపిచ్చాడు : "ఒట్టోమన్ పన్నుల పద్ధతి, ఒట్టోమన్ సిస్తుల
అధికారి ఆత్మ కథ, సిస్తు తిరుగుబాటులు అణిచివేత - ఒట్టోమన్ సామ్రాజ్యం! అమోఘమైన కూర్పు కదూ!".
అధికారి ఆత్మ కథ, సిస్తు తిరుగుబాటులు అణిచివేత - ఒట్టోమన్ సామ్రాజ్యం! అమోఘమైన కూర్పు కదూ!".
"శతకోటి ధన్యవాదాలు" అని పుస్తకాలు తీసుకుని తలుపుకేసి నడిచాను.
"గుర్రాలకి కళ్ళెం వేయి" అంటూ కేక వేశాడు. ఆ మూడూ ఇక్కడే చదవాలి - యెట్టి పరిస్థితుల్లో ఈ భవనం
వీడకూడదు.
వీడకూడదు.
(4)
నిజంగానే ప్రతి పుస్తకానికి ఒక ఎర్ర చీటి అంటించి ఉంది - "లైబ్రరీ కే పరిమితం". "అవి చదవటానికి
లోపల గది వాడాలి".
లోపల గది వాడాలి".
నా చేతి గడియారం కేసి చూశాను. 5:20 అయ్యింది. "కానీ గ్రంధాలయం మూసే వేళ అయ్యింది. భోజనం
వేళకి ఇంటికి చేరకపోతే అమ్మ కంగారు పడుతుంది."
వేళకి ఇంటికి చేరకపోతే అమ్మ కంగారు పడుతుంది."
గుబురుగా ఉన్న అతని కనుబొమ్మలు ముడుచుకుని ఒక్క గీత లాగా దగ్గరకు చేరాయి. "మూయడం
సమస్య కాదు. నేను యేది చెపితే అది చేస్తారు ఇక్కడ. ముఖ్యమైన ప్రశ్న - నీకు నా సహాయం విలువైనదా
కాదా అన్నది? ఈ బరువైన పుస్తకాలు యెందుకు మోసుకు వచ్చాను అనుకుంటున్నావు? నా ఆరోగ్యానికా?"
సమస్య కాదు. నేను యేది చెపితే అది చేస్తారు ఇక్కడ. ముఖ్యమైన ప్రశ్న - నీకు నా సహాయం విలువైనదా
కాదా అన్నది? ఈ బరువైన పుస్తకాలు యెందుకు మోసుకు వచ్చాను అనుకుంటున్నావు? నా ఆరోగ్యానికా?"
"క్షమించండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇవి బయటకు తీసుకెళ్లలేమని నాకు
తెలియలేదు."
తెలియలేదు."
ముసలాయన కంపించిపోతో దగ్గి రూమాల లోకి తడి ముద్ద లాంటిది ఉమ్మాడు. మొహం మీద నల్లటి
మచ్చలు కోపంతో నాట్యం చేయడం మొదలు పెట్టాయి.
మచ్చలు కోపంతో నాట్యం చేయడం మొదలు పెట్టాయి.
"నీకు యేమి తెలుసో తెలియదో అనేదానితో నిమిత్తం లేదు" కసిరాడు. "నాకు నీ వయసప్పుడు చదవటమే
మహాభాగ్యం. నువ్వూ ఉన్నావు - సమయం గురించి తిండికి ఆలస్యం అవ్వడం గురించి బేజారు
అవుతున్నావు. యెంత ధైర్యం!"
మహాభాగ్యం. నువ్వూ ఉన్నావు - సమయం గురించి తిండికి ఆలస్యం అవ్వడం గురించి బేజారు
అవుతున్నావు. యెంత ధైర్యం!"
"సరే, నేను ఉండి చదువుతాను. కానీ అర గంట మాత్రమే" అన్నాను ఓటమి అంగీకరిస్తూ.
వద్దు, చేయను అని నేను యెవరికీ చెప్పలేను. "అంత కన్నా యెక్కువ మాత్రం ఉండలేను. నేను బాగా
చిన్నప్పుడు బడి నుంచి ఇంటికి వెళ్తుంటే ఒక నల్ల కుక్క కరిచింది. అప్పట్నుంచి నేను రావడం
ఆలస్యం అయితే మా అమ్మ బెంబేలు యెత్తిపోతుంది."

అతని మొహం కొంచం శాంతించింది. "అయితే నువ్వు ఇక్కడే ఉండి చదువుతావా?"
"ఊం.. ముప్పై నిమిషాలు మాత్రమే."
"అయితే ఇటు పద" ముసలాయన దారి తీశాడు. లోపల తలుపు వెనకాల నడవిలో నీడలు పడుతో చీకటి
చీకటి గా ఉంది. బిక్కు బిక్కు మంటూ యెప్పుడు కొండెక్కుతుందా అన్న ఆ దీపం కాంతిలోకి అడుగులు
వేసాము.
చీకటి గా ఉంది. బిక్కు బిక్కు మంటూ యెప్పుడు కొండెక్కుతుందా అన్న ఆ దీపం కాంతిలోకి అడుగులు
వేసాము.
(5)
"నా వెంబడే రా," అన్నాడాయన.
కొంచం దూరం వెళ్ళాక నడవి రెండుగా చీలింది. ఆయన కుడి వైపుకు తిరిగాడు. ఇంకాస్త దూరంలో ఇంకో
చీలిక. ఈసారి యెడమకి తిరిగాడు. నడవి చీలిక పై చీలిక చీలుతూనే ఉంది. ప్రతీసారి ముసలాయన
తడుముకోకుండా మొదట కుడి వైపు తర్వాత యెడమ వైపు తిరుగుతూనే ఉన్నాడు. ఒకోసారి తలుపు
యేదో తెరిచి సరికొత్త నడవిలో ప్రవేశించే వాళ్ళము.

నా బుర్రలో కల్లోలం మొదలైంది. ఇది చాలా వింతగా ఉంది - మా ఊరి గ్రంధాలయం కింద ఇంత పెద్ద
వలయం యెలా ఉంది? ప్రబుత్వ గ్రంధాలయాలు డబ్బులు లేక ఇక్కట్లు పడుతుంటే పెద్దది కాదు కదా
చిన్న వలయం కూడా వాటి శక్తికి మించిన పని. అదే విషయం అతన్ని అడుగుదామని అనుకున్నాను
కానీ అరుస్తాడేమోనని ఊరుకున్నాను.
వలయం యెలా ఉంది? ప్రబుత్వ గ్రంధాలయాలు డబ్బులు లేక ఇక్కట్లు పడుతుంటే పెద్దది కాదు కదా
చిన్న వలయం కూడా వాటి శక్తికి మించిన పని. అదే విషయం అతన్ని అడుగుదామని అనుకున్నాను
కానీ అరుస్తాడేమోనని ఊరుకున్నాను.
యెట్టకేలకి ఆ వలయం ఒక పెద్ద ఇనుప ద్వారం దగ్గర ముగిసింది. తలుపు మీద "చదువుకునే గది" అని
రాసి ఉంది. స్మశాన వాటిక కన్నా యెక్కువ సన్నాటం అక్కడ నెలకొని ఉంది.
రాసి ఉంది. స్మశాన వాటిక కన్నా యెక్కువ సన్నాటం అక్కడ నెలకొని ఉంది.
ముసలాయన జేబులోంచి తాళం చెవుల గుత్తి తీసి దానిలోంచి ఓ పాత కాలపు చెవి లాగాడు. దానిని
కప్పలో గుచ్చి, నాకేసి ఒక క్షణం అర్ధవంతంగా చూసి, కుడి పక్కకి తిప్పాడు. తాళం చెవి తాళం గడిలో
ఇమిరి పెద్ద శబ్ధం చేస్తూ తిరిగింది. కీచుమని శబ్ధంతో తలుపు తెరుచుకుంది.
కప్పలో గుచ్చి, నాకేసి ఒక క్షణం అర్ధవంతంగా చూసి, కుడి పక్కకి తిప్పాడు. తాళం చెవి తాళం గడిలో
ఇమిరి పెద్ద శబ్ధం చేస్తూ తిరిగింది. కీచుమని శబ్ధంతో తలుపు తెరుచుకుంది.
"భేష్, భేష్. ఇదే మన గమ్యం" ప్రకటించాడు ఆయన. "పద లోపలికి"
"ఈ లోపలికి?" అడిగాను.
"ఉద్దేశం అదే."
నేను ససేమిరా అన్నాను. నిజంగా ఆ తలుపుకి అవతల బ్రహ్మాండం కి చిల్లు పడినంత నల్లగా ఉంది.
ముసలాయన నిటారుగా నుంచుని నాకేసి తిరిగాడు. ఆ క్షణంలో నాకు అతిపెద్దగా అగుపించాడు.
గుబురుగా ఉన్న కనుబొమ్మల కింద కళ్ళు, అసుర సంధ్యవేళ గొర్రె కళ్ళు మెరిసినట్టు మెరిసాయి.
ముసలాయన నిటారుగా నుంచుని నాకేసి తిరిగాడు. ఆ క్షణంలో నాకు అతిపెద్దగా అగుపించాడు.
గుబురుగా ఉన్న కనుబొమ్మల కింద కళ్ళు, అసుర సంధ్యవేళ గొర్రె కళ్ళు మెరిసినట్టు మెరిసాయి.
"ప్రతీ చిన్న విషయానికీ తప్పు పట్టే వాడిలా ఉన్నావే?"
"లేదండీ. కానీ నాకు యేమనిపిస్తోందంటే..."
"నీ కల్లిబొల్లి మాటలు కట్టిపెట్టు" ఆయన అంటున్నాడు, "అన్నిటికీ యేదో సాకు చెప్పి, తమ పని
మానుకుని సహాయం చేయడానికి వచ్చిన వారి శ్రమ వృధా చేసేవాళ్ళంటే నాకు అసలు గిట్టదు.
అలాంటి వారు చెత్తతో సమానం."
మానుకుని సహాయం చేయడానికి వచ్చిన వారి శ్రమ వృధా చేసేవాళ్ళంటే నాకు అసలు గిట్టదు.
అలాంటి వారు చెత్తతో సమానం."
"మన్నించండి, నేను లోపలికి వెళ్తాను".
"యెందుకిలా ప్రవర్తిస్తాను! ఇష్టం లేకపోయిన యెందుకు మిగతా వాళ్ళకి అవసరమైన పనులు నాతో చేయించుకోనిస్తాను"
"ద్వారంకి అవతల వైపు మెట్లు ఉన్నాయి. దొర్లి పడిపోకుండా పిట్టగోడ గట్టిగా పట్టుకో "
అడుగులో అడుగు వేసుకుంటూ నేను ముందు దిగాను. నా వెనకాల ఆయన లోపలికి వచ్చి తలుపు
వేశాడు. అంతా గాఢాంధకారం నెలకొంది. క్లిక్ మని తాళం చెవి తిరగడం వినపడింది.
వేశాడు. అంతా గాఢాంధకారం నెలకొంది. క్లిక్ మని తాళం చెవి తిరగడం వినపడింది.
"తాళం యెందుకు వేశారు?"
"నియమం ప్రకారం ఈ తలుపులు యెప్పుడూ తాళం వేసే ఉండాలి"
ఇంకేమీ చేసేది లేక దిగడం కొనసాగించాను. ఆ మెట్లకి అంతు ఉన్నట్టు లేదు. బ్రజిల్ దాకా వెళ్ళేటట్టే
ఉన్నాయి. పిట్ట గోడ మీద ఉన్న ఇనుప చువ్వలు తుప్పు పట్టిపోయి చేతి కి పొడి పొడి గా తగిలింది.
కన్ను పొడుచుకున్నా చిన్న కాంతి పుంజం కూడా కాన రాలేదు.
ఉన్నాయి. పిట్ట గోడ మీద ఉన్న ఇనుప చువ్వలు తుప్పు పట్టిపోయి చేతి కి పొడి పొడి గా తగిలింది.
కన్ను పొడుచుకున్నా చిన్న కాంతి పుంజం కూడా కాన రాలేదు.
యెట్టకేలకి కిందకి చేరాము. దూరంగా మిణుకు మిణుకు మంటూ సన్నటి దీపపు కాంతి కనపడింది.
సన్నటిదే అయినప్పటికీ కారు చీకటికి అలవాటు పడ్డ నా కళ్ళు ఆ కాంతికి నొప్పి పెట్టడం
మొదలుపెట్టాయి. యెవరో వచ్చి నా చెయ్యి తీసుకున్నారు. చూడటానికి చిన్నగా ఉన్నాడు. మేక చర్మం
వేసుకుని ఉన్నాడు.
సన్నటిదే అయినప్పటికీ కారు చీకటికి అలవాటు పడ్డ నా కళ్ళు ఆ కాంతికి నొప్పి పెట్టడం
మొదలుపెట్టాయి. యెవరో వచ్చి నా చెయ్యి తీసుకున్నారు. చూడటానికి చిన్నగా ఉన్నాడు. మేక చర్మం
వేసుకుని ఉన్నాడు.
"వచ్చినందుకు ధన్యవాదాలు" అన్నాడు అతను.
"నమస్కారం" అంటూ చేతులు జోడించాను.
(7)
అతనిది ముమ్మాటికీ మేక తోలే. శరీరం లో ప్రతీ అంగుళం దానితో కప్పబడి ఉంది. మొహం దగ్గర
మాత్రం చూడటానికి వీలుగా రంధ్రం ఉంది. స్నేహపూర్వకంగా నేత్రద్వయం నన్ను పరికించాయి.
మేక తోలు అతనికి బాగా నప్పింది. ఒక నిమిషం పాటు నన్నూ ఆ మూడు పుస్తకాల్ని తేరిపార చూశాడు.
మాత్రం చూడటానికి వీలుగా రంధ్రం ఉంది. స్నేహపూర్వకంగా నేత్రద్వయం నన్ను పరికించాయి.
మేక తోలు అతనికి బాగా నప్పింది. ఒక నిమిషం పాటు నన్నూ ఆ మూడు పుస్తకాల్ని తేరిపార చూశాడు.
"నిజంగానే చదవడానికి వచ్చావా?"
"అవును".
"అవునా, నిజంగానే చదవడానికి వచ్చావా?"
అతను మాట్లాడే విధానం చాలా వింతగా ఉంది. నేను మాటల కోసం తడబడ్డాను.
"బదులు చెప్పు", ముసలాయన గదిమాడు, "నువ్వూ ఇక్కడికి చదవడానికి వచ్చావు. అది నిజమే కద?
తిన్నగా సమాధానం చెప్పు."
తిన్నగా సమాధానం చెప్పు."
"అవును నేను చదవడానికే వచ్చాను"
"విన్నావు కదా" అన్నాడు మేక తోలు మనిషికేసి చూస్తూ.
"మరీ చిన్న పిల్లవాడు అండీ" అన్నాడు అతను జాలిగా.
"నోర్ముయి!" ఘీంకరించాడు నన్ను తీసుకుని వచ్చినాయన. వెనకాల జేబులోంచి బెత్తం తీసి మేకతోలు
మనిషికి మొహం మీద వాత పెట్టి, గదిలోకి తీసుకెళ్లమని గదిమాడు.
మనిషికి మొహం మీద వాత పెట్టి, గదిలోకి తీసుకెళ్లమని గదిమాడు.
మేక మనిషి మొహం లో అనిశ్చిత కనపడింది. అలాగే నా చెయ్యి పట్టుకుని అటుకేసి నడవటం మొదలు
పెట్టాడు. బెత్తం దెబ్బకి అతని పెదం పక్కన యెర్రగా వాత పడింది. "సరే పద వెళ్దాం" అన్నాడు.
పెట్టాడు. బెత్తం దెబ్బకి అతని పెదం పక్కన యెర్రగా వాత పడింది. "సరే పద వెళ్దాం" అన్నాడు.
"యెక్కడికి?"
"పఠనం గదికి. ఆ పుస్తకాలు చదవటానికే వచ్చావు కద?"
మేక మనిషి ఓ ఇరుకైన నడవిలోంచి తీసుకు వెళ్ళాడు. ముసలాయన వెనకాలే మమ్మల్ని అంటిపెట్టుకుని
ఉన్నాడు. గొర్రె మనిషి దుస్తులుకి వెనకాల చిన్న తోక వెళ్లాడ్తోంది. ప్రతీ అడుగుకి అటు ఇటు గడియారం
గరిట లాగా కదులుతోంది.
ఉన్నాడు. గొర్రె మనిషి దుస్తులుకి వెనకాల చిన్న తోక వెళ్లాడ్తోంది. ప్రతీ అడుగుకి అటు ఇటు గడియారం
గరిట లాగా కదులుతోంది.
"ఇదిగో వచ్చేశాము", అన్నాడు మేక మనిషి నడవి చివరాతలికి చేరాక.
"ఆగండి మేక మనిషి గారు", గొణిగాను " కొంపాతీసి ఇది యేమన్నా
"కచ్చితంగా అదే" సావధానంగా అన్నాడు.
"బాగా పసికట్టావు " తాపీగా చెప్పాడు ముసలాయన.
"నాతో నువ్వు చెప్పింది ఇది కాదు" నిష్టూరంగా అరిచాను. "రీడింగ్ రూమ్ అన్నావనే నేను ఇంత దూరం
వచ్చింది"
వచ్చింది"
"నువ్వు మోసపోయావు" మేక మనిషి తలూపాడు.
"అవును, నీకు వూలు టోపీ పెట్టాను" నవ్వాడు ముసలాయన.
"ఇంత మోసం చెయ్యడానికి నీకు మనసు యెలా ఒప్పింది.."
"మాటలు జాగ్రత్త" బెత్తం చూపిచ్చాడు ముసలాయన. వెంటనే ఒక అడుగు వెనక్కి వేశాను.దానితో వాతలు
తినే ఉద్దేశం నాకు లేదు.
తినే ఉద్దేశం నాకు లేదు.
"లోపలికి పద - ఇంక వాదనలు వద్దు. ఆ మూడు పుస్తకాలు ఈ చివర నుంచి ఆ చివర దాకా కంఠస్తమ్ చెయ్యి.
ఇంకో నెల తరువాత నేను స్వయంగా వచ్చి పరీక్షిస్తాను. నీకు మొత్తం వచ్చిందనిపిస్తే నీకు విముక్తి
కలిగిస్తాను" అన్నాడు ముసలాయన.
ఇంకో నెల తరువాత నేను స్వయంగా వచ్చి పరీక్షిస్తాను. నీకు మొత్తం వచ్చిందనిపిస్తే నీకు విముక్తి
కలిగిస్తాను" అన్నాడు ముసలాయన.
"ఇంత బండ పుస్తకాలు గుర్తుంచుకోవడం అసాధ్యం" ప్రాధేయ పడ్డాను "పైగా మా అమ్మ ఈ పాటికి
నాగురించి చాలా బెంబేలు పడుతూ ఉంటుంది...."
నాగురించి చాలా బెంబేలు పడుతూ ఉంటుంది...."
ముసలాయన పళ్ళు కొరికి బెత్తంని గట్టిగా ఝుళిపించాడు. నేను చటుక్కుని పక్కకి తప్పుకున్నాను.
దెబ్బ మేక మనిషి మొహం మీద బలంగా పడింది. కోపంతో ఊగిపోతో ముసలాయన మేక మనిషిని
మళ్ళీ కొట్టాడు. అన్యాయం.
దెబ్బ మేక మనిషి మొహం మీద బలంగా పడింది. కోపంతో ఊగిపోతో ముసలాయన మేక మనిషిని
మళ్ళీ కొట్టాడు. అన్యాయం.
"జైల్లో పడెయ్యి" మేక మనిషికి హుకుం ఇచ్చి ముసలాయన వెళ్లిపోయాడు.
"దెబ్బ తగిలిందా" అని మేక మనిషిని అడిగాను.
"పర్వాలేదు, ఇది నాకు అలవాటే" అన్నాడు. బాగానే ఉన్నట్టు కనిపిచ్చాడు.
"నాకు ఇది ఇష్టం లేదు కానీ నిన్ను లాకప్ లో వెయ్యక తప్పదు."
"నేను ఒప్పుకోక పోతే? లోపలికి వెళ్ళక పోతే? అప్పుడు యెమౌతుంది?"
"అప్పుడు నన్ను ఇంకా గట్టిగా కొడతాడు"
మేక మనిషిని చూస్తే బాధ వేసింది. గదిలోకి ప్రవేశించాను. మామూలు మంచం, బల్ల, నీళ్ళ తొట్టే,
మూలగా టాయిలెట్ ఉన్నాయి. పళ్లకుంచే, చెంబు తొట్టే పక్కన అమర్చి ఉన్నాయి. అవి శుబ్రంగా
అసలు లేవు. టూత్పేస్ట్ వాసన నాకు అసలు పడలేదు. మేక మనిషి బల్ల మీద ఉన్న దీపాన్ని వేస్తో తీస్తో
ఆడుతున్నాడు.
మూలగా టాయిలెట్ ఉన్నాయి. పళ్లకుంచే, చెంబు తొట్టే పక్కన అమర్చి ఉన్నాయి. అవి శుబ్రంగా
అసలు లేవు. టూత్పేస్ట్ వాసన నాకు అసలు పడలేదు. మేక మనిషి బల్ల మీద ఉన్న దీపాన్ని వేస్తో తీస్తో
ఆడుతున్నాడు.
"దీన్ని చూడు, బాగుంది కదూ" అంటూ నాకేసి తిరిగి సకిలించాడు.
(9)
"రోజూ నీకు మూడు పూట్లా భోజనం తెస్తాను", మేక మనిషి చెప్పాడు. "మధ్యానం మూడింటికి పాకం గారెలు
ఇస్తాను. అవి నేను స్వయంగా వేస్తాను, కరకరలాడుతూ అమృతంలా ఉంటాయి."
ఇస్తాను. అవి నేను స్వయంగా వేస్తాను, కరకరలాడుతూ అమృతంలా ఉంటాయి."
తీపి గారెలు నాకు చాలా ఇష్టం.
"సరే నీ కాళ్ళు జాపు"
కాళ్ళు బయటకు పెట్టాను.
మేక మనిషి మంచం కింద నుంచి బరువైన ఇనుప బంతి తీశాడు. దాని నుంచి ఒక ఇనుప గొలుసు
వేళ్లాడుతోంది. ఆ గొలుసును నా కాళ్ళకి చుట్టి తాళం వేశాడు. తాళం చెవి పైజేబు లో వేసుకున్నాడు.
వేళ్లాడుతోంది. ఆ గొలుసును నా కాళ్ళకి చుట్టి తాళం వేశాడు. తాళం చెవి పైజేబు లో వేసుకున్నాడు.
"బాగా చల్లగా ఉంది" వాపోయాను.
"బాధపడకు. అలవాటు అయిపోతుంది."
"మేక మనిషి గారు, నిజంగా నెల మొత్తం ఉండాలా?"
"అవును, ఆ వ్యవధి సరైనది."
"కానీ ఈ పుస్తకాలన్నీ బట్టి పడితే నన్ను వదిలేస్తాడు కదూ?"
"అది మాత్రం అవుతుంది అని నేను అనుకోను."
"అయితే నా పరిస్తితి యేమౌతుంది?"
మేక మనిషి తల పక్కకి వంచి "బాబూ అది క్లిష్టమైన ప్రశ్న."
"దయచేసి చెప్పు. మా అమ్మ ఇంట్లో నాకోసం కాచుకుని ఉంది".
"సరే అబ్బాయి. తిన్నగా చెప్తాను. నీ మాడు రంపం తో కోయబడుతుంది. ఆ పై మెదడు జుర్రుకుంటాడు."
అవాక్కైపోయాను. "అంటే ఆ ముసలాయన నా మెదడు తినేస్తాడా!?"
"అవును, నన్ను క్షమించు, కానీ అలాగే అవ్వాలి" మేక మనిషి మొహమాటం గా సమాధానం ఇచ్చాడు.
(10)
తల పట్టుకుని మంచం మీద కూలపడ్డాను. ఇలాంటిది నాతోనే యెందుకు జరగాలి?
నేను చేసిందల్లా పుస్తకాలు అరువు తీసుకోడానికి గ్రంధాలయం వెళ్లడమే.
నేను చేసిందల్లా పుస్తకాలు అరువు తీసుకోడానికి గ్రంధాలయం వెళ్లడమే.
"నిబ్బరించుకో" ఓదారుస్తూ అన్నాడు "ఫలహారం తీసుకుని వస్తాను. వేడి భోజనం తింటే కొంచం
కుదుట పడతావు."
కుదుట పడతావు."
"మేక మనిషి గారు, ఆ ముసలాయనకి నా మెదడు యెందుకు తినాలని ఉంది"
"యెందుకంటే, విజ్ఞానం తో నిండి ఉన్న మెదడ్లు రుచిగా ఉంటాయి, అందుకని. అవి చక్కగా మెత్తగా
ఉంటాయి. మెత్తగా ఉంటూనే అవి పువ్వుల్లా విచ్చుకుని ఉంటాయి."
ఉంటాయి. మెత్తగా ఉంటూనే అవి పువ్వుల్లా విచ్చుకుని ఉంటాయి."
"అందుకేనా ఈ నెల రోజులు ఈ ఒట్టోమన్ విషయాలన్నీ మెదడులో కుక్కమన్నాడు? తర్వాత కమ్మగా
జుర్రుకోటానికా?
జుర్రుకోటానికా?
"ఉద్దేశం అదే"
"చాలా క్రూరం గా ఉందే," అన్నాను "మెదడు పోయే వాడి కోణం లోంచి చూస్తే."
"కానీ ఇలాంటివి ప్రతీ లైబ్రరిలో జరుగుతూనే ఉంటాయి. ఇంచుమించుగా అన్నిట్లో"
ఆ వార్త నన్ను చకితుడ్ని చేసింది. "అన్నీ గ్రంథాలయాల్లోనా?" నీళ్ళు నమిలాను.
"ఉత్తినే విజ్ఞానం అంత ఇచ్చేస్తే, ఇంక వాళ్ళకు ఒరిగిదేమిటి?" అన్నాడు అతను.
"అలాగని జనాల మాడు తరిగేసి మెదడ్లు ఆరగించే అధికారం యెవరు ఇచ్చారు. మరీ కొంచం
యెక్కువగా లేదూ?"
యెక్కువగా లేదూ?"
గొర్రె మనిషి నాకేసి బాధగా చూశాడు. "దురదృష్టవంతుడివి, అంత కన్నా యేమీ లేదు. ఇలాంటివి
అవుతుంటాయి."
అవుతుంటాయి."
"కానీ మా అమ్మ నా గురించి బెంగ పెట్టుకుంటుంది. ఇక్కడ నుంచి పారిపోడానికి సహాయం చేయలేవా?"
"లేదు అది పని చెయ్యదు. నేను నిన్ను తప్పిస్తే, గొంగళి పురుగులున్న జాడిలోకి నన్ను తోసేస్తాడు.
పెద్ద జాడీ లో మూడు రోజులు ఉండాలి. దానిలో పది వేల పురుగులు పాకుతుంటాయి."
పెద్ద జాడీ లో మూడు రోజులు ఉండాలి. దానిలో పది వేల పురుగులు పాకుతుంటాయి."
"అది జుగుప్సుకరం", మనసులో అనిపిచ్చింది బయటకు చెప్పాను.
"కారణం విన్నావు కదా, అందుకే నిన్ను తప్పించలేను బాబూ. నిజంగా క్షంతవ్యుడను."
(11)
మేక మనిషి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ చిన్న చెరసాలలో నేను ఒక్కడ్ని మిగిలాను.
తలగడలో తల దాచుకుని ఆ గంట మొత్తం యేడిచాను. గొధుమ పొట్టుతో చేసిన ఆ నీలం దిండు
నా కన్నీళ్ళకి పూర్తిగా తడిసిపోయింది. కాళ్ళకి కట్టిన ఇనుప గోళం చాలా భారంగా ఉంది.
తలగడలో తల దాచుకుని ఆ గంట మొత్తం యేడిచాను. గొధుమ పొట్టుతో చేసిన ఆ నీలం దిండు
నా కన్నీళ్ళకి పూర్తిగా తడిసిపోయింది. కాళ్ళకి కట్టిన ఇనుప గోళం చాలా భారంగా ఉంది.
--- సశేషం
Comments
Post a Comment