Posts

Showing posts from January, 2024

Kai Baar Yun Bhi Dekha Hai / कई बार यूँ भी देखा है

Kai Baar Yun Bhi Dekha Hai / कई बार यूँ भी देखा है   కి స్వేచ్ఛనువాదం... పలు మార్లు ఇదీ చూసాం ఈ మనసు కున్న సరిహద్దూ మనసు దాటుతూ ఉంటుందీ తానెరుగని దాహం కోసం తానెరుగని ఆశల కోసం మది పరిగెడుతూ ఉంటుంది దారుల్లో, రహ దారుల్లో బ్రతికేటి దారుల్లో విప్పారే పూలు, పూలు మందారాలై ఏ పూవు తీసుకోవాలో హృదయంలో కొలవాలో యేమిటో యేమిటేమిటో ఈ చింతా యేమిటో తీర్చేది ఎట్లో తెలీక సతమతమౌనే ఎవరిని వరి ఇంచను ఎవరి ప్రేమ మరపించను

ఘడియలు చెప్పే గడియారంలో గంటలు గణించినపుడు

  ఘడియలు చెప్పే గడియారంలో గంటలు గణించినపుడు షేక్స్పియర్     Sonnet 12: When I do count the clock that tells the time   కి స్వేచ్ఛనువాదం... ఘడియలు చెప్పే గడియారంలో గంటలు గణించినపుడు, గండ్రగొడ్డలి వంటి పగలు కళ్లు కప్పి మాయమయ్యె కరాళ రాత్రియై; సువాసనలు విరిసే మల్లెతీగలు వడిలి హొయలు బాసినపుడు, కాలనాగు వంటి నల్లటి కురులు మెరవగా ముగ్గువలె ధవళమై; మహోన్నత వృక్షాలు ఆకులు రాలి మోడుగా అగుపడిన కారులో అవేకాదా నిరుడు మండుటెండలో మందలకి గొడుగుగా నీడనిచ్చాయి,  వసంతాల సరివన్నెల పచ్చిక ముడుచుకుని మూటైనపుడు పైరులో గడ్డ మంచు కౌగిలిలో కటుకపై తెల్లని ముసుగై మరీ నిల్చాయి, అప్పుడు స్ఫురించింది ఈ ప్రశ్న అహో నీ అందం కాలం చేసే లయవిన్యాసంలో అంతం అవ్వక తప్పదు కదా, ప్రేయసీ ప్రియులు తమను తాము త్యాగం చేసే అనుబంధం వలపుల పంట అంతకు అంత అవ్వగా తాము సమసిపోతారు గదా;     కాలపు కొడవలి కోత నుంచి లేదు జగాన కాపాడే  యే  కవచం,     కొత్త తరం తక్క, నూకలు తీరిననాడు ఎగిరిపోవడం తథ్యం ఈ వచం