Posts

Showing posts from November, 2026

ఏకాంతం సాధ్యమయ్యే అవకాశం ఉండటమే స్వేచ్ఛ

  ఫెర్నాండో పెసోవా  ర చించిన     The Book of Disquiet లో అంశం నెంబర్ 438 ఏకాంతం సాధ్యమయ్యే అవకాశం ఉండటమే  స్వేచ్ఛ. ధనం కోసంగాని,  సాన్నిహిత్యం  కోసంగాని, ప్రేమ, కీర్తి, కుతూహలం కోసంగాని, మరొక మనిషిని ఆశ్రయించాలనే కోరిక లేకుండా  మనుషుల నుండి వేరుగా మసలగలిగితేనే  స్వేచ్ఛగా ఉన్నట్లు.ఎందుకంటే అవేవి మౌనంలో, ఏకాంతంలో వృద్ధి చెందవు. ఒంటరిగా బ్రతకలేకపోతే బానిసగా పుట్టినట్లే. నీలో ఎన్ని సద్గుణాలున్నా, ఉత్తముడైన బానిసకి లేక తెలివైన బంటుకి నీవు తేడా లేదు. నువ్వు  స్వేచ్ఛా జీవివి కావు. కాని ఆ విషాదం నీది కాదు. ఎందుకంటే అలా పుట్టడం నీ విషాదం కాదు, విధిది. కాని ఒక వేళ జీవితం యొక్క భారమే నిన్ను కట్టుబానిస చేసిందా, ఇంక అది మాత్రం నీ కర్మమే. సంకెలలు లేకుండా పుట్టి,  ఏకాకిగా ఉంటూ,  నీ అవసరాలు నీకు నువ్వే సమకూర్చుకుంటూ ఉండగా, పేదరికం పరుల పంచకు త్రోసిందంటే గడ్డుకాలం వచ్చినట్లే. ఆ శోకం నీ ఒక్కడిదే, నువ్వు మాత్రమే దానిని భరించాలి. విముక్తుడిగా పుట్టడం మనిషియొక్క అత్యున్నతమైన లక్షణం. అదే, చిన్న కుటీరంలో ఉండే సన్యాసిని రాజులకంటే, దేవతలకంటే కూడా...