యుధిష్ఠిర! మృత్యువు ప్రసన్నమైనప్పుడు మనిషి యొక్క ఆప్తమిత్రుడు ఎవరు?
క్షణాలను కాలసర్పం కబళించే ఘడియల్లో
మృత్యుదేవత చల్లని వడిలో వాలే వేకువలో
అహోరాత్రులూ పోగేసిన ధనరాశి, అహర్నిశం తోడున్న జీవిత భాగస్వామి
కానేరవు మహాత్మా , మనిషికి స్నేహితులు
ఒంటరై, మనుజుడొక్కడే, మునుపెరుగని మనుగడదెలియని మరుభూమిలో
చిరుగాలిలో రెపరెపలాడే ఆకు నేలవ్రాలినట్లు,చేరడా మహాప్రస్థానంలో
సమసిపోయే ప్రమిధ మహోజ్వలంగా వెలిగిపోయినట్లుగా
కుంగి పోయే కుసుమం జిలుగు రంగుల గుబాళింపు పరిమళించినట్లుగా
జగన్నాథా! చితిమంటల ఆధారమే ఈ కాషాయంలో
కట్టెలవలే తేలెనే బ్రతుకు కోరికల సుడిగుండంలో
జీవితానికి నిశ్వాస, స్ఫురించునే అగ్నికీలల పావకంలో
అరిషడ్వార్గాలు భస్మీపటలం చేయుమా ఈ హవనంలో
స్వార్ధానికి అతీతమైన స్వచ్ఛమైన ప్రార్థన విశాల గగనాన్ని తాకదా
చేసిన ధర్మము చెడని పదార్ధమై మన వెంట చేరదా
ధర్మదేవతలో ఐక్యమయ్యే ముహూర్తంలో దాత్రుగుణమే మన ఆప్త బంధువు కాదా!
---- Free translation of a sonnet from "Yuddhistira & Draupadi" by Pavan Varma. Inspired by Gulzar's translation to Hindi
Comments
Post a Comment