కాంత - అన్యాక్రాంత - కౌంతేయ


కోరిక సుడిగాలై  పాకింది నరాలలో

విజయుడి బహుమతి కైవసం చేసుకున్న తొలి రేయిలో.

అపుడేమైంది పాంచాలీ జగన్మోహినన్న నీ గర్వానికి

నేనూ విజేతనే తెర మరుగున అన్న ఆ మగతనానికి?

ఊపిరిసల్పనీయలేదా నిన్ను పశ్చాత్తాపం లేని బాహువులతో

నైపుణ్యంగా తానే గెలుచుకున్నట్లు నిన్ను, స్వహస్తాలతో?

నీ హొయలలో మోహం మాటు అయ్యిందా

అతని క్రింద నీ నడుము ఒలలూగినప్పుడు?

ఆ కేళిలో, వాడి వేడిలో చలించి అకస్మాత్తుగా

సెగలు బూడిదై, నిట్టూర్పుతో అతను కృంగిపోగా

యవ్వన సంభోగలోలమైన నీ ఓజస్సులో

సుఖభంగాన్ని కప్పిబుచ్చే సంయమనం దాగిందా?

గదాధారుడు కాదు, ధనుష్టంకారం చేయలేడు

కానీ యెనలేని అహంకారాన్ని త్యజించలేని ధీరుడాతడు.

--- Free translation of a sonnet from  "Yuddhistira & Draupadi" by Pavan Varma. Inspired by Gulzar's translation to Hindi

Comments

  1. Stainless Steel T-Shirt - TITanium Artists
    Stainless 2014 ford focus titanium hatchback Steel T-Shirt. $8.99. Made in Solingen, Germany. T.A.S. made a number mens titanium necklace of famous designs around the camillus titanium world. Its titanium engagement rings unique titanium wedding band designs are unique

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సుదీర్ఘ యానం

ఊపిరి