ఒకనాడీ భువి సకలము

 

ఒకనాడీ భువి సకలము

            - దేవులపల్లి కృష్ణ శాస్త్రి

            -తాత్పర్యంలో మరియు ఆంగ్ల అనువాదంలో తప్పులు మీ విధేయుడివి


ఒకనాడీ భువి సకలము స్వర్గము సుకముల సొగసుల సునారామము
వికచ విభాత శుభముల దామము ప్రకట యశోవిలసితము స్వతంత్రము
కులముల మతముల కూడని ఈసుల అలసత కృపణత అలమిన మనసుల
ఖల పరపన్నగ గాడ విషానలా విలమై, ఖలమై అలమెను దాస్యము

భువి = భూమి
సుకము = సుఖము
సునారామము = సు + ఆరామము
ఆరామము = ఉద్యానవనం, తోట
వికచ = వికసించునది
విభాత = ప్రభాతం, వేకువ
దామము = హారము, దండ, పలుపు త్రాడు
ప్రకట = స్పష్టముగా కనపడుట, ప్రసిద్ధమైనది
యశము = కీర్తి 
విలసితము = ప్రకాశింపబడినది
కూడని = తప్పైన, సరి కాని
ఈసులు = చెదలు, రెక్క పురుగులు
అలసత = ఆలస్యం, సోమరితనం, జడత్వం
కృపణత = నీచం, మూర్ఖత్వం
అలమిన = వ్యాపించిన, ఆక్రమించిన
ఖల = దుష్టుడు, పాపం, ధర్మం వదిలిన వాడు
పర = శత్రువు; చంపుటకు సిద్ధమైన
పన్నగ = పాము
గాడ = గాఢ = దట్టమైన, ధృడమైన
విషానల = విష + అనల
విష = విషం
అనల = అగ్ని
విలము = కప్పునది, గుహ, బిలము
దాస్యము = ఊడిగము


ఒకప్పుడు సుఖ సంపన్నమై ఆహ్లాదకరమైన ఉద్యానవనంలా ఉన్న భూమి, వికసించిన వేకువవలె శుభముల హారముగా కీర్తి ప్రసిద్ధమై స్వతంత్రముగా వెలిగింది. మారని (నిలిచిపోయిన) కులం మతం అనే సరి కాని చెదల మూర్ఖత్వం మనసులని క్రమ్ముకుంది. ఆ పాపపు సర్పాల దట్టమైన విష జఠరాగ్ని భూమిని ఆక్రమించి దాస్య శృంఖలాలలో కట్టివేసింది.


The Earth, all of it, was once a Paradise; Gardens of tranquility, happiness, beauty our Prize
Blooming and radiant the dawn - garland of good tidings; beacon of freedom all round Known!
Caste, creed, religion - the debilitating rot; the status-quoist ignorance afflicted our Lot
Unrighteous serpents these, engulfing us in poisonous fire; servitude of Adharma is now our Mire!

Comments

Popular posts from this blog

సుదీర్ఘ యానం

ఊపిరి

కాంత - అన్యాక్రాంత - కౌంతేయ