నూతన సంవత్సరోదయం
నూతన సంవత్సరోదయం
హెలెన్ హంట్ జాక్సన్ (1830 - 1885) New years morning అని 1892 లో రాసిన పద్యంలోని రెండవ చరణానికి స్వేచ్ఛనువాదం...
ప్రతీ రాత్రి నిన్న నుంచి రేపటికి!
రాత్రి అల సొలసిన మేనులకు సల్లని నిదురుల రేయి!
ప్రతి ఉదయం నిజమైన నూతన సంవత్సరోదయం,
నిఖిలమైన పండగల ఆర్ణవం.
ప్రతి రేత్రి చేయాలి పవిత్ర ధాత్రి
అహము బాసి దీక్షబూని భక్తి శ్రద్ధలతో;
ప్రతి దినం మహోన్నత ముహూర్తమే కన్ను తెరిచి కదిలి పోడానికి
సరికొత్త ఆహ్లాదం ఈ వెచ్చని గాలిలో ఆ పచ్చికపైరులో.
కేవలం ఒక రాత్రి పాత నుంచి కొత్తకి;
కేవలం ఒకే నిద్దర నెలరాజు నుండి సూరీడుకు.
కొత్తదనం కాదా పాతల కలల సాకారం;
ప్రతి ఉషోదయం సరికొత్త యుగానికి ఆకారం.
Comments
Post a Comment