ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా

బందిని చిత్రంలో శైలేంద్ర రచించిన గీతం  अब के बरस भेज भैया को बाबुल   కి స్వేచ్ఛానువాదం...


ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా

శ్రావణం పిలుస్తోంది తీపిగా నన్ను

వెనుకకి వచ్చినప్పుడు నా చిన్ననాటి స్నేహితులు

పంపవా చల్లని కబురు నాకు

ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా


గున్న మామిడి తోటలో మళ్ళీ ఊగుతాయి ఊయలలు

చిటపట చినుకులు తడుపుతాయి మళ్ళీ చిరు జల్లులు

తిరిగి వస్తాయి మీ వాకిట్లో నాన్నా

శ్రావణ మేఘాల చల్ల గాలులు

కళ్ళలో నీరు తిరిగేనే పాశం ఇంటికి లాగేనే

చిన్ననాటి గురుతులు మనసున మరలినంతనే

ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా


రాకాసి యవ్వనం తీసుకుపోయింది ఆటల ఆస్తులని

రంగు రంగుల బొమ్మలు నావి కాజేసుకు వెళ్లింది

నీ గారాల పట్టీ నేను కదా నాన్నా

మరెందుకు అయ్యాను ఇప్పుడు పరాయి నేను

కాలాలు గడిసిపోయాయి జాబులు మాత్రం రావు

రాలేదు ఎదురు చూసినా నావారు ఎవరూ

ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా


శ్రావణం పిలుస్తోంది తీపిగా నన్ను

వెనుకకి వచ్చినప్పుడు నా చిన్ననాటి స్నేహితులు

పంపవా చల్లని కబురు నాకు

ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా

-- పవన్ చిట్టాప్రగడ

Comments

Popular posts from this blog

సుదీర్ఘ యానం

ఊపిరి

కాంత - అన్యాక్రాంత - కౌంతేయ