సెలయేరు కలిసింది కృష్ణమ్మలో
అనోఖీ రాత్ చిత్రంలో ఇందీవర్ రచించిన గీతం ओह रे, ताल मिले नदी के जल में కి స్వేచ్ఛానువాదం...
ఓ ఓడమాలి, తీరం కానదేమోయి
సెలయేరు కలిసింది కృష్ణమ్మలో, కృష్ణమ్మ కలిసింది ఆ కడలిలో
కడలి కడకి కలిసేది ఏ నీటిలో ఏ నీటిలో, తెలియలేదే ఎవ్వరికీ
సూరీడు కోసం భూమమ్మ ఎదురు సూస్తాది
నేల తల్లికోసం సెందురూడు కాపు కాస్తాడు
సెందురూడు కాపు కాస్తాడు
నీటనున్న నత్తగుల్ల వలే ఆ…. నీటనున్న నత్త వలే
ప్రతి హుదయానికి దప్పికే ఆ… దప్పికే
ఓ నేస్తమా ఓ…
నీటనున్న నత్తగుల్ల వలే ప్రతి హుదయానికి దప్పికే
సుక్క యే మబ్బున దాగుందో ఎవడికి ఎరుకా, ఎవడికి యెరుక
ఓ ఓడమాలి, తీరం కానదేమోయి
సెలయేరు కలిసింది కృష్ణమ్మలో, కృష్ణమ్మ కలిసింది ఆ కడలిలో
కడలి కడకి కలిసేది ఏ నీటిలో ఏ నీటిలో, తెలియలేదే ఎవ్వరికీ
తెలియని పెదాల పైన తెలిసిన పాటలెందుకో
తెలిసిన పాటలెందుకో
నిన్నటిదాకా తెలియనివారు, జనమ జనమాల జోడు నేడు
జనమ జనమాల జోడు నేడు
ఓ నేస్తమా ఓ…
నిన్నటిదాకా తెలియనివారు, జనమ జనమాల జోడు నేడు
యే నిమిసాన యేమి జరుగుతాదో యెవరికి తెలుసు యెవరికి తెలుసు
ఓ ఓడమాలి, తీరం కానదేమోయి
సెలయేరు కలిసింది కృష్ణమ్మలో, కృష్ణమ్మ కలిసింది ఆ కడలిలో
కడలి కడకి కలిసేది ఏ నీటిలో ఏ నీటిలో, తెలియలేదే ఎవ్వరికీ
-- పవన్ చిట్టాప్రగడ
Comments
Post a Comment