Posts

సెలయేరు కలిసింది కృష్ణమ్మలో

అనోఖీ రాత్ చిత్రంలో ఇందీవర్ రచించిన గీతం    ओह रे, ताल मिले नदी के जल में     కి స్వేచ్ఛానువాదం... ఓ ఓడమాలి, తీరం కానదేమోయి సెలయేరు కలిసింది కృష్ణమ్మలో, కృష్ణమ్మ కలిసింది ఆ కడలిలో కడలి కడకి కలిసేది ఏ నీటిలో ఏ నీటిలో, తెలియలేదే ఎవ్వరికీ సూరీడు కోసం భూమమ్మ ఎదురు సూస్తాది నేల తల్లికోసం సెందురూడు కాపు కాస్తాడు సెందురూడు కాపు కాస్తాడు నీటనున్న నత్తగుల్ల వలే ఆ…. నీటనున్న నత్త వలే ప్రతి హుదయానికి దప్పికే ఆ… దప్పికే ఓ నేస్తమా ఓ… నీటనున్న నత్తగుల్ల వలే ప్రతి హుదయానికి దప్పికే సుక్క యే మబ్బున దాగుందో ఎవడికి ఎరుకా, ఎవడికి యెరుక ఓ ఓడమాలి, తీరం కానదేమోయి సెలయేరు కలిసింది కృష్ణమ్మలో, కృష్ణమ్మ కలిసింది ఆ కడలిలో కడలి కడకి కలిసేది ఏ నీటిలో ఏ నీటిలో, తెలియలేదే ఎవ్వరికీ తెలియని పెదాల పైన తెలిసిన పాటలెందుకో తెలిసిన పాటలెందుకో నిన్నటిదాకా తెలియనివారు, జనమ జనమాల జోడు నేడు జనమ జనమాల జోడు నేడు ఓ నేస్తమా ఓ… నిన్నటిదాకా తెలియనివారు, జనమ జనమాల జోడు నేడు యే నిమిసాన యేమి జరుగుతాదో యెవరికి తెలుసు యెవరికి తెలుసు ఓ ఓడమాలి, తీరం కానదేమోయి సెలయేరు కలిసింది కృష్ణమ్మలో, కృష్ణమ్మ కలిసింది ఆ కడలిలో కడలి...

ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా

బందిని చిత్రంలో శైలేంద్ర రచించిన గీతం    अब के बरस भेज भैया को बाबुल     కి స్వేచ్ఛానువాదం... ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా శ్రావణం పిలుస్తోంది తీపిగా నన్ను వెనుకకి వచ్చినప్పుడు నా చిన్ననాటి స్నేహితులు పంపవా చల్లని కబురు నాకు ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా గున్న మామిడి తోటలో మళ్ళీ ఊగుతాయి ఊయలలు చిటపట చినుకులు తడుపుతాయి మళ్ళీ చిరు జల్లులు తిరిగి వస్తాయి మీ వాకిట్లో నాన్నా శ్రావణ మేఘాల చల్ల గాలులు కళ్ళలో నీరు తిరిగేనే పాశం ఇంటికి లాగేనే చిన్ననాటి గురుతులు మనసున మరలినంతనే ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా రాకాసి యవ్వనం తీసుకుపోయింది ఆటల ఆస్తులని రంగు రంగుల బొమ్మలు నావి కాజేసుకు వెళ్లింది నీ గారాల పట్టీ నేను కదా నాన్నా మరెందుకు అయ్యాను ఇప్పుడు పరాయి నేను కాలాలు గడిసిపోయాయి జాబులు మాత్రం రావు రాలేదు ఎదురు చూసినా నావారు ఎవరూ ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా శ్రావణం పిలుస్తోంది తీపిగా నన్ను వెనుకకి వచ్చినప్పుడు నా చిన్ననాటి స్నేహితులు పంపవా చల్లని కబురు నాకు ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా -- పవన్ చిట్టాప్రగడ

ఊపిరి

  బెకీ హెంస్లీ      Breathe     కి స్వేచ్ఛానువాదం... మరుగున ఉంటే నీకు బిడియమన్నారు ముందుకు వస్తే నీకు గర్వమన్నారు అడుగుతారు దారి కానీ విని తల దూర్చకన్నారు నీ గొంతు పెద్దదన్నారు కానీ గమ్మునుంటే నివ్వెరపోయారు లేదు వాంఛ అంటే అయ్యో పాపం అన్నారు కలలు పంచుకుంటే పిచ్చిదానివన్నారు చెప్పు వింటామన్నారు విని చెవులు మూసుకున్నారు భయమంటే హత్తుకున్నారు వెనుతిరిగి ఫక్కున నవ్వుకున్నారు అన్న మాటలన్నీ విన్నది, విన్న చిన్నది తాననుకున్నది వాళ్ళు గీసిన అమ్మాయవ్వాలని, ఆ ఉత్తమ స్త్రీ వారనుకున్నది ఒకనాటి మహోదయాన గుండెసవ్వడి అడిగింది నాకేది శ్రేష్ఠమని చాలు చెలి  ఇక సంతృప్తి పరచడం  మరి  అందరిని వేగిరమే పయనమై కానలకి, చెట్ల నడిలో నుంచుంది ఆకులతో చిరుగాలి గుసగుసలు వింది రెపరెపలాడే కేళి చూసింది మద్దితో మాట్లాడింది కదళితో కబుర్లాడింది పున్నాగని పలకరించింది ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి వసంతం ప్రతి శిశిరం అందరూ చెప్పిన నిర్దేశాలు వినిపించింది జీవితాన ప్రతీ క్షణాన నాలో ఎపుడూ లేమి నాలోనే ఎదో లోపం నా ఉనికి ఒకరికి మరీ తక్కువ లేకపోతే అంతెందుకు మరీ ఎక్కువ ఒకసారి స్థాయి ఎక్కువ కాకప...

తల కొంతగా వంచితే రాయి కూడా దేవతై పోతుంది

బషీర్ బద్ర్    सर झुकाओगे तो पत्थर देवता हो जाएगा     కి స్వేచ్ఛానువాదం... తల కొంతగా వంచితే రాయి కూడా దేవతై పోతుంది తన నంతగా ప్రేమించకు తను వంచకై పోతుంది నేనూ నదినే నా గతి శృతి నాకు తెలుసు ఏ వైపుకు వెళితే అదే తుళ్ళి తుళ్ళి దారై పోతుంది ఎంతో నిజాయతీతో జీవితం నాతో అంది నువ్వు నాకు కాకపోతే మరొకరితో  నాకు  ముడై పోతుంది పై వాడి మీద భారం వేసి తాగుతున్నాను మిత్రమా హాలాహలం ఉన్నా ఇందులో ఔషధమై పోతుంది అన్నీ తనవే గాలి పరిమళం నేల నీలాకాశం నేను ఎటు వెళ్లినా ఎక్కడికి వెళ్లినా తనకి తేట తెల్లమై పోతుంది

మనసా నందమా నంద మాయే

  Man Anand Anand Chayo   కి స్వేచ్ఛనువాదం... మనసా నందమా నంద మాయే కడతేరగా గగనాన ఘనాంధకారం విప్పారిన కనుల సూరీడాయే మనసా నందమా నంద మాయే ఎగిసే అలల అందాల కిరణాలు గంగమ్మ ఒడిలోని పవిత్ర జలాలు అర్పించు వేళ ప్రతి సింగారం తేనెలొలుకు సింధూర గీతమై పాడెనే మనసా నందమా నంద మాయే మనసున పేరుకున్న పుట్టెడంత చింతలు కరిగి కన్నీళ్ళై చేతిన వర్షించగా అశృతుషారాలతో బిక్కు బిక్కు నున్న ప్రతి రోమము రొమ్ము విప్పి నవ్వేనే మనసా నందమా నంద మాయే మానస సరోవరం కల్లోల మగ్నం నవదర్పణం తొంగి చూడగా పాశం నాశం లేనిదై  అర్థనిమీలిత నేత్రాలతో ప్రాణ హంస తరలి వచ్చెనే మనసా నందమా నంద మాయే

Kai Baar Yun Bhi Dekha Hai / कई बार यूँ भी देखा है

Kai Baar Yun Bhi Dekha Hai / कई बार यूँ भी देखा है   కి స్వేచ్ఛనువాదం... పలు మార్లు ఇదీ చూసాం ఈ మనసు కున్న సరిహద్దూ మనసు దాటుతూ ఉంటుందీ తానెరుగని దాహం కోసం తానెరుగని ఆశల కోసం మది పరిగెడుతూ ఉంటుంది దారుల్లో, రహ దారుల్లో బ్రతికేటి దారుల్లో విప్పారే పూలు, పూలు మందారాలై ఏ పూవు తీసుకోవాలో హృదయంలో కొలవాలో యేమిటో యేమిటేమిటో ఈ చింతా యేమిటో తీర్చేది ఎట్లో తెలీక సతమతమౌనే ఎవరిని వరి ఇంచను ఎవరి ప్రేమ మరపించను

ఘడియలు చెప్పే గడియారంలో గంటలు గణించినపుడు

  ఘడియలు చెప్పే గడియారంలో గంటలు గణించినపుడు షేక్స్పియర్     Sonnet 12: When I do count the clock that tells the time   కి స్వేచ్ఛనువాదం... ఘడియలు చెప్పే గడియారంలో గంటలు గణించినపుడు, గండ్రగొడ్డలి వంటి పగలు కళ్లు కప్పి మాయమయ్యె కరాళ రాత్రియై; సువాసనలు విరిసే మల్లెతీగలు వడిలి హొయలు బాసినపుడు, కాలనాగు వంటి నల్లటి కురులు మెరవగా ముగ్గువలె ధవళమై; మహోన్నత వృక్షాలు ఆకులు రాలి మోడుగా అగుపడిన కారులో అవేకాదా నిరుడు మండుటెండలో మందలకి గొడుగుగా నీడనిచ్చాయి,  వసంతాల సరివన్నెల పచ్చిక ముడుచుకుని మూటైనపుడు పైరులో గడ్డ మంచు కౌగిలిలో కటుకపై తెల్లని ముసుగై మరీ నిల్చాయి, అప్పుడు స్ఫురించింది ఈ ప్రశ్న అహో నీ అందం కాలం చేసే లయవిన్యాసంలో అంతం అవ్వక తప్పదు కదా, ప్రేయసీ ప్రియులు తమను తాము త్యాగం చేసే అనుబంధం వలపుల పంట అంతకు అంత అవ్వగా తాము సమసిపోతారు గదా;     కాలపు కొడవలి కోత నుంచి లేదు జగాన కాపాడే  యే  కవచం,     కొత్త తరం తక్క, నూకలు తీరిననాడు ఎగిరిపోవడం తథ్యం ఈ వచం