Posts

ఓ విభావరీ! ఓహో విభావరీ!

ఓ విభావరీ! ఓహో విభావరీ!             -  డా.బాలాంత్రపు రజనీకాంతరావు                -తాత్పర్యంలో మరియు ఆంగ్ల అనువాదంలో తప్పులు మీ విధేయుడివి ఓ విభావరీ! ఓహో విభావరీ! నీహార హీర నీలాంబర ధారిణీ, మనోహారిణీ!! నీ చంచల చేలాంచల నిభృత స్వప్న సీమలలో ఏలా భయచ్ఛాయాజాల మేలా సౌఖ్యరోచిర్లీల!! ఓ విభావరీ! ఓహో విభావరీ!! సంతత శాంతతరంగిణి మదభరయువకురంగిణి ఏలా యలసగమనమ్ము ఏలా నవవిలసనమ్ము!! ఓ విభావరీ! ఓహో విభావరీ!! ధరణీతలచంద్రశిలా తరళమంటపమున నిలిచి యుగములుగ పరిభ్రమింతు నగమ్యుడౌ యెవని వలచి!! ఓ విభావరీ! ఓహో విభావరీ!! కవి రాత్రి గురించి వర్ణిస్తున్నారు. విభావరి, తెల్లటి మంచు రత్నంలా ఉంది నీమీద. చీకటిని నల్లటి చీర లాగా ధరించావు, మనసు దోచావు. రెపరెపలాడే నీ కోక అంచులలో నిశ్చలమైన కలల సామ్రాజ్యం ఉంది. సుఖమయ కాంతులు వెదజల్లే ఆ చోట మరింకెందుకు ఆ భయం? ఓ రేయి, నిరంతరం పారే శాంతమైన నదివి నీవు. మదోన్మత్తమైన వయసులో ఉన్న జింకవి నీవు. అయినా ఎందుకు ఈ వడిలేని అడుగులు? ఏంటీ క్రొత్త కేళి? ఓ నిశా వనితా, చంద్రునికాంతిలో మెరిసిపోయే భూమి అనే రత్న మంటపం మీద నిలబ...

మృత భాషల పంథాలో తెలుగు

  తెలుగు బాష కొంచం కొంచం గా మన ముందే అంతరించి పోతోంది. తెలుగు సాహిత్యం చదివే వాళ్ళ సంఖ్య నానాటికి తగ్గిపోయింది. సాహిత్యం దాకా ఎందుకు, తెలుగు లో  చదవగలిగే వాళ్లే కరువు అయిపోతున్నారు. ఇంటిలో తల్లి తండ్రుల ప్రవృత్తి, బడిలో చదువులు రెండూ తెలుగు ని కాటికి పంపిస్తున్నాయి. ఇదే విధం గా సాగితే ఇంకో నలభై సంవత్సరాల్లో తెలుగు లో రాసేవాళ్ళు ఎవరు ఉండరు. అంటే క్రొత్త రచనలు రావు. ఆ పై నలభై సంవత్సరాల్లో మాట్లాడే వాళ్లు కూడా ఉండరు. 2100 కల్లా తెలుగు మృత బాష అవ్వడం తథ్యం.  తెలుగు చచ్చిపోవడం అంటే ఏంటి? పోతన భాగవతం గతించి పోవడం. స్మశానంలో ఉండే నీకు ఇద్దరు భార్యలు ఎందుకు అని శివుడినే నిలదీసిన శ్రీనాధ చాటువుకి చాటింపు లేకపోవడం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న క్రిష్ణదేవరాయులు ధీమాని మన చేజేతులా చట్టుబండలు చెయ్యడం. తెలుగు చచ్చిపోవడం అంటే -  త్యాగయ్య గాత్రాలు  త్యజించు కోవడం. కుతుబ్ షా చెరలో  రామదాసు వ్యధ వ్యర్థం కావడం. అన్నమయ్య కీర్తనలులేక బ్రహ్మపాదం మలిన పడడం.  తెలుగు చచ్చిపోవడం అంటే - మధురవాణి మూగబోయి, గురజాడ కన్యాశుల్కం శుష్కించుకు పోవడం. చిలకమర్తి గారి పాడి ఆవు అనాధ అయిపోవడ...

కాంత - అన్యాక్రాంత - కౌంతేయ

కోరిక సుడిగాలై  పాకింది నరాలలో విజయుడి బహుమతి కైవసం చేసుకున్న తొలి రేయిలో. అపుడేమైంది పాంచాలీ జగన్మోహినన్న నీ గర్వానికి నేనూ విజేతనే తెర మరుగున అన్న ఆ మగతనానికి? ఊపిరిసల్పనీయలేదా నిన్ను పశ్చాత్తాపం లేని బాహువులతో నైపుణ్యంగా తానే గెలుచుకున్నట్లు నిన్ను, స్వహస్తాలతో? నీ హొయలలో మోహం మాటు అయ్యిందా అతని క్రింద నీ నడుము ఒలలూగినప్పుడు? ఆ కేళిలో, వాడి వేడిలో చలించి అకస్మాత్తుగా సెగలు బూడిదై, నిట్టూర్పుతో అతను కృంగిపోగా యవ్వన సంభోగలోలమైన నీ ఓజస్సులో సుఖభంగాన్ని కప్పిబుచ్చే సంయమనం దాగిందా? గదాధారుడు కాదు, ధనుష్టంకారం చేయలేడు కానీ యెనలేని అహంకారాన్ని త్యజించలేని ధీరుడాతడు. --- Free translation of a sonnet from  "Yuddhistira & Draupadi" by Pavan Varma. Inspired by Gulzar's translation to Hindi

యుధిష్ఠిర! మృత్యువు ప్రసన్నమైనప్పుడు మనిషి యొక్క ఆప్తమిత్రుడు ఎవరు?

క్షణాలను కాలసర్పం కబళించే ఘడియల్లో మృత్యుదేవత చల్లని వడిలో వాలే వేకువలో అహోరాత్రులూ పోగేసిన ధనరాశి, అహర్నిశం తోడున్న జీవిత భాగస్వామి కానేరవు మహాత్మా , మనిషికి స్నేహితులు ఒంటరై, మనుజుడొక్కడే, మునుపెరుగని మనుగడదెలియని మరుభూమిలో చిరుగాలిలో రెపరెపలాడే ఆకు నేలవ్రాలినట్లు,చేరడా మహాప్రస్థానంలో సమసిపోయే ప్రమిధ మహోజ్వలంగా వెలిగిపోయినట్లుగా కుంగి పోయే కుసుమం జిలుగు రంగుల గుబాళింపు పరిమళించినట్లుగా జగన్నాథా! చితిమంటల ఆధారమే ఈ కాషాయంలో కట్టెలవలే తేలెనే బ్రతుకు కోరికల సుడిగుండంలో జీవితానికి నిశ్వాస, స్ఫురించునే అగ్నికీలల పావకంలో అరిషడ్వార్గాలు భస్మీపటలం చేయుమా ఈ హవనంలో స్వార్ధానికి అతీతమైన స్వచ్ఛమైన ప్రార్థన విశాల గగనాన్ని తాకదా చేసిన ధర్మము చెడని పదార్ధమై మన వెంట చేరదా ధర్మదేవతలో ఐక్యమయ్యే ముహూర్తంలో దాత్రుగుణమే మన ఆప్త బంధువు కాదా! ---- Free translation of a sonnet from  "Yuddhistira & Draupadi" by Pavan Varma. Inspired by Gulzar's translation to Hindi

సత్యంగారిల్లెక్కడ?

"విషాన్ని విషంగా  గుర్తించడానికి ఇష్టపడని వాళ్ళకి అది విషం అని చెప్పడం వృధా."  నార్వేకి చెందిన నాటకాల రచయిత హెన్రిక్ ఇబ్సెన్ 1882 లో రచించిన నాటిక "యాన్ ఎనిమి అఫ్ ది పీపుల్ " ని పంతొమ్మిది వందల అరవైల్లో గొల్లపూడి మారుతీ రావుగారు తెలుగు రంగస్థలం కోసం "సత్యంగారిల్లెక్కడ" గా అనువర్తించారు. సత్యజిత్ రాయ్ ఇబ్సెన్ నాటికని ఘనశత్రు పేరుతో 1990 లో సినిమాగా తీశారు. గొల్లపూడి గారి నాటికని ఈరోజు మళ్ళీ చదివాను. ఆ నాటిక లో ముఖ్య పాత్ర అయిన డా:సత్యం సత్యం కోసం తన జీవితం మొత్తం పణంగా పెట్టి అన్నీ కోల్పోతాడు. అతని ఆవేదనని మారుతీ గారు పై పదాలలో మనకి చెప్పించారు. ఈ నాటిక ఈనాటికి ఏనాటికి అయినా అద్దం పడుతుంది. కుట్రలు కుతంత్రాలు తో మకిల పడిన సమాజం , దానిని తమ స్వప్రయోజనాల కోసం వంచించే రాజకీయ నాయకులు, అజ్ఞానంతో తోలు బొమ్మల లాగా వాళ్ళ చేతిలో ఆయుధాలు అయ్యే అమాయక ప్రజలు, వీళ్లందరి నడుమ సత్యం కోసం నిలబడిన డాక్టర్ సత్యం ఈ నాటిక కథాంశం. డాక్టర్ గారి మావగారు ఆ ఊరి చైర్మన్. ఊరిలో అందరినీ  అంతుపట్టని వ్యాధి పీడిస్తుంది. సత్యం అహోరాత్రులు కష్టపడి దానికి కారణం, నాలుగు ఏళ్ళు క్రిత...

విచిత్ర గ్రంధాలయం

-- హరుకి మురకామి రచించిన జాపనీస్ పుస్తకం "ది స్ట్రేంజ్ లైబ్రరీ" యొక్క స్వేచ్చానువాదం (1) గ్రంధాలయం యెప్పటి కన్నా నిశ్సబ్ధం గా ఉంది. నా కొత్త తోలు బూట్లు నేల మీద టక్ టక్ శబ్ధం చేస్తున్నాయి. పొడిగా గట్టిగా ఉన్న ఆ శబ్ధం నా మామూలు అడుగులకి భిన్నంగా ఉంది. కొత్త బూట్లు కొన్నప్పుడల్లా ఆ చప్పుడు అలవాటు అవ్వడానికి నాకు కొన్నాళ్లు పడుతుంది. ఇంతకు మునుపెన్నడూ చూడని ఒకావిడ, పుస్తకాలు అరువు ఇచ్చే విభాగంలో కూచుని ఉంది. ఆవిడ చాలా పెద్దగా వెడల్పుగా ఉన్న ఒక పుస్తకం చదువుతోంది. కుడి పక్క పుట కుడి కంటితో యెడమ పక్క పుట యెడమ కంటితో చదువుతున్నట్లు ఉంది.  “మేడమ్” అని ఆవిడిని పిలిచాను. పుస్తకాన్ని గట్టిగా మూసి ఆవిడ నా వైపు చూసింది. "ఈ పుస్తకాలు వెనక్కి ఇవ్వడానికి వచ్చాను" అంటూ పుస్తకాల్ని ఆవిడ ముందు బల్ల మీద పెట్టాను. అందులో ఒకటి "హౌ టు బిల్డ్ ఏ సబ్మెరైన్", ఇంకోటి "మెమొయిర్ ఆఫ్ ఏ షెపర్డ్". ఆవిడ పుస్తకాలు తెరిచి వెనక్కి తిరిగి ఇవ్వవలిసిన తేదీ చూసింది. తిరిగి ఇవ్వడానికి ఇంకా వ్యవధి ఉంది. నేను యెప్పుడూ సమయాతీతంగా ఇవ్వను. మా అమ్మ నాకు...