క్షణాలను కాలసర్పం కబళించే ఘడియల్లో మృత్యుదేవత చల్లని వడిలో వాలే వేకువలో అహోరాత్రులూ పోగేసిన ధనరాశి, అహర్నిశం తోడున్న జీవిత భాగస్వామి కానేరవు మహాత్మా , మనిషికి స్నేహితులు ఒంటరై, మనుజుడొక్కడే, మునుపెరుగని మనుగడదెలియని మరుభూమిలో చిరుగాలిలో రెపరెపలాడే ఆకు నేలవ్రాలినట్లు,చేరడా మహాప్రస్థానంలో సమసిపోయే ప్రమిధ మహోజ్వలంగా వెలిగిపోయినట్లుగా కుంగి పోయే కుసుమం జిలుగు రంగుల గుబాళింపు పరిమళించినట్లుగా జగన్నాథా! చితిమంటల ఆధారమే ఈ కాషాయంలో కట్టెలవలే తేలెనే బ్రతుకు కోరికల సుడిగుండంలో జీవితానికి నిశ్వాస, స్ఫురించునే అగ్నికీలల పావకంలో అరిషడ్వార్గాలు భస్మీపటలం చేయుమా ఈ హవనంలో స్వార్ధానికి అతీతమైన స్వచ్ఛమైన ప్రార్థన విశాల గగనాన్ని తాకదా చేసిన ధర్మము చెడని పదార్ధమై మన వెంట చేరదా ధర్మదేవతలో ఐక్యమయ్యే ముహూర్తంలో దాత్రుగుణమే మన ఆప్త బంధువు కాదా! ---- Free translation of a sonnet from "Yuddhistira & Draupadi" by Pavan Varma. Inspired by Gulzar's translation to Hindi