Posts

బిమల్ రాయ్

బిమల్ రాయ్ ("ప్రత్యక్షంగా...వారిని కలిసాను", గుల్జార్ గుర్తులు నుండి అనువాదం) నిజం చెప్పాలంటే పంజాబీ కుటుంబంలో పుట్టినా నేను పంజాబీను ఎంతో బెంగాలీను కూడా అంతే. ఎనిమిదో  తరగతిలో ఉండగా ఠాగోర్ నన్ను ఆవహించాడు, కాదు కాదు నేనే ఆయన్ని  పెనవేసుకున్నాను. అప్పటినుంచి ఖచ్చితంగా చెప్పలేను బెంగాలీ నాలో ఇమిడిపోయిందో లేక నేను బెంగాలీలో మునిగిపోయానో. పదోతరగతి అయ్యేప్పటికి ఠాగోర్, శరత్ చంద్ర చట్టోపాధ్యాయ, బంకించంద్ర చట్టోపాధ్యాయ సాహిత్యం ఉర్దూ అనువాదంలో పరిచయం అయ్యింది.  బెంగాలీ స్నేహితులు బడిలో సంభాషించుకోవడం విని నేనూ నేర్చుకోవాలని ఉవ్విళ్లూరాను. నేర్చుకున్నాను. తోడుగా సాహిత్య పఠనంలో అడుగులు వేస్తూవచ్చాను. షుమారు ఈ కాలంలోనే అనుకుంటా రచయత అవ్వాలనే కోరిక నాలో నాటుకో సాగింది. సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఉండగా ముంబాయి (అప్పట్లో బొంబాయి) లో ఉన్న మా పెద్ద అన్నయ్య దగ్గరకి నన్ను పంపించారు. బహుశా జీవితం పనికిరాని వాటితో వృధా చేయకుండా బ్రతుకుతెరువు నేర్చుకోవడం కోసం పంపించారు అనుకుంటా. అదే నా యందు ఒక వరమయ్యింది. బొంబాయి వెళ్ళగానే ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ (అభ్యుదయ రచయితల సంఘం) లో, ఇంకా ఇండి...

ఒకనాడీ భువి సకలము

  ఒకనాడీ భువి సకలము             - దేవులపల్లి కృష్ణ శాస్త్రి                -తాత్పర్యంలో మరియు ఆంగ్ల అనువాదంలో తప్పులు మీ విధేయుడివి ఒకనాడీ భువి సకలము స్వర్గము సుకముల సొగసుల సునారామము వికచ విభాత శుభముల దామము ప్రకట యశోవిలసితము స్వతంత్రము కులముల మతముల కూడని ఈసుల అలసత కృపణత అలమిన మనసుల ఖల పరపన్నగ గాడ విషానలా విలమై, ఖలమై అలమెను దాస్యము భువి = భూమి సుకము = సుఖము సునారామము = సు + ఆరామము ఆరామము = ఉద్యానవనం, తోట వికచ = వికసించునది విభాత = ప్రభాతం, వేకువ దామము = హారము, దండ, పలుపు త్రాడు ప్రకట = స్పష్టముగా కనపడుట, ప్రసిద్ధమైనది యశము = కీర్తి  విలసితము = ప్రకాశింపబడినది కూడని = తప్పైన, సరి కాని ఈసులు = చెదలు, రెక్క పురుగులు అలసత = ఆలస్యం, సోమరితనం, జడత్వం కృపణత = నీచం, మూర్ఖత్వం అలమిన = వ్యాపించిన, ఆక్రమించిన ఖల = దుష్టుడు, పాపం, ధర్మం వదిలిన వాడు పర = శత్రువు; చంపుటకు సిద్ధమైన పన్నగ = పాము గాడ = గాఢ = దట్టమైన, ధృడమైన విషానల = విష + అనల విష = విషం అనల = అగ్ని విలము = కప్పునది, గుహ, బిలము దాస్యము = ఊడిగము ఒకప్పుడు స...

SARASWATAM: హృద్యం-తెనుగు పద్యం 6 ( సిద్ధాంతమేదైన నా రక్షణ బా...

SARASWATAM: హృద్యం-తెనుగు పద్యం 6 ( సిద్ధాంతమేదైన నా రక్షణ బా... :     హృద్యం-తెనుగు పద్యం 6 ( సిద్ధాంతమేదైన నా రక్షణ బాధ్యతనీదే )                                               డాక్టర్ . చిలకమర్తి దుర్గా...

నెయ్యములల్లో నేరేళ్ళో

నెయ్యములల్లో నేరేళ్ళో   -- అన్నమాచార్య కీర్తన  -- క్రింద తాత్పర్యంలో తప్పులు ఉంటే క్షమించి తప్పు సవరించగలరు.   పల్లవి: నెయ్యములల్లో నేరేళ్ళో వొయ్యన వూరెడి వువ్విళ్ళో చరణములు: పలచని చెమటల బాహుమూలముల చెలమలలోనాఁ జెలువములే థళథళమను ముత్యపుఁ జెఱఁగు సురటి దులిపేటి నీళ్ళ తుంపుళ్ళో తొటతొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ చిటి పొటి యలుకల చిరునగవే వట ఫలంబు నీ వన్నెల మోవికి గుటకల లోనా గుగ్గిళ్ళో గరగరికల వేంకటపతి కౌఁగిట పరిమళములలో బచ్చనలు (లే) మరునివింటి కమ్మనియంప విరుల గురితాఁకు లినుప గుగ్గిళ్ళో కష్టమైనా పదాలకు అర్ధాలు: నెయ్యము = స్నేహము, ప్రేమ, ఇంపు అల్లో నేరేళ్ళు = కాముని పున్నమికి స్త్రీలు ఆడే కోలాటం ఒయ్యన = నెమ్మదిగా, వయ్యారంగా  చెలమ = ఊట; తవ్వబడిన పల్లము చెలువము = అందము చెరగు = అంచు; కొంగు సురటి = విసిన కఱ్ఱ తొరుగు = ప్రవహించు; కారు; పడు నగవు = నవ్వు వట = మఱ్ఱి చెట్టు వన్నె = రంగు, అందము మోవి = పెదవి గరగరికల = చక్కదనం; అందం బచ్చన = పూత; పూయడం మరుడు = మన్మథుడు వింటి = విల్లు కమ్మని = ఆహ్లాదకరమైన; తీపి అంప = బాణము విరి = పుష్పము; వికసించినది తాత్పర్యము అన్నమయ్య ఊహించిన గొప్ప శృంగార దృ...

ఓ విభావరీ! ఓహో విభావరీ!

ఓ విభావరీ! ఓహో విభావరీ!             -  డా.బాలాంత్రపు రజనీకాంతరావు                -తాత్పర్యంలో మరియు ఆంగ్ల అనువాదంలో తప్పులు మీ విధేయుడివి ఓ విభావరీ! ఓహో విభావరీ! నీహార హీర నీలాంబర ధారిణీ, మనోహారిణీ!! నీ చంచల చేలాంచల నిభృత స్వప్న సీమలలో ఏలా భయచ్ఛాయాజాల మేలా సౌఖ్యరోచిర్లీల!! ఓ విభావరీ! ఓహో విభావరీ!! సంతత శాంతతరంగిణి మదభరయువకురంగిణి ఏలా యలసగమనమ్ము ఏలా నవవిలసనమ్ము!! ఓ విభావరీ! ఓహో విభావరీ!! ధరణీతలచంద్రశిలా తరళమంటపమున నిలిచి యుగములుగ పరిభ్రమింతు నగమ్యుడౌ యెవని వలచి!! ఓ విభావరీ! ఓహో విభావరీ!! కవి రాత్రి గురించి వర్ణిస్తున్నారు. విభావరి, తెల్లటి మంచు రత్నంలా ఉంది నీమీద. చీకటిని నల్లటి చీర లాగా ధరించావు, మనసు దోచావు. రెపరెపలాడే నీ కోక అంచులలో నిశ్చలమైన కలల సామ్రాజ్యం ఉంది. సుఖమయ కాంతులు వెదజల్లే ఆ చోట మరింకెందుకు ఆ భయం? ఓ రేయి, నిరంతరం పారే శాంతమైన నదివి నీవు. మదోన్మత్తమైన వయసులో ఉన్న జింకవి నీవు. అయినా ఎందుకు ఈ వడిలేని అడుగులు? ఏంటీ క్రొత్త కేళి? ఓ నిశా వనితా, చంద్రునికాంతిలో మెరిసిపోయే భూమి అనే రత్న మంటపం మీద నిలబ...

మృత భాషల పంథాలో తెలుగు

  తెలుగు బాష కొంచం కొంచం గా మన ముందే అంతరించి పోతోంది. తెలుగు సాహిత్యం చదివే వాళ్ళ సంఖ్య నానాటికి తగ్గిపోయింది. సాహిత్యం దాకా ఎందుకు, తెలుగు లో  చదవగలిగే వాళ్లే కరువు అయిపోతున్నారు. ఇంటిలో తల్లి తండ్రుల ప్రవృత్తి, బడిలో చదువులు రెండూ తెలుగు ని కాటికి పంపిస్తున్నాయి. ఇదే విధం గా సాగితే ఇంకో నలభై సంవత్సరాల్లో తెలుగు లో రాసేవాళ్ళు ఎవరు ఉండరు. అంటే క్రొత్త రచనలు రావు. ఆ పై నలభై సంవత్సరాల్లో మాట్లాడే వాళ్లు కూడా ఉండరు. 2100 కల్లా తెలుగు మృత బాష అవ్వడం తథ్యం.  తెలుగు చచ్చిపోవడం అంటే ఏంటి? పోతన భాగవతం గతించి పోవడం. స్మశానంలో ఉండే నీకు ఇద్దరు భార్యలు ఎందుకు అని శివుడినే నిలదీసిన శ్రీనాధ చాటువుకి చాటింపు లేకపోవడం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న క్రిష్ణదేవరాయులు ధీమాని మన చేజేతులా చట్టుబండలు చెయ్యడం. తెలుగు చచ్చిపోవడం అంటే -  త్యాగయ్య గాత్రాలు  త్యజించు కోవడం. కుతుబ్ షా చెరలో  రామదాసు వ్యధ వ్యర్థం కావడం. అన్నమయ్య కీర్తనలులేక బ్రహ్మపాదం మలిన పడడం.  తెలుగు చచ్చిపోవడం అంటే - మధురవాణి మూగబోయి, గురజాడ కన్యాశుల్కం శుష్కించుకు పోవడం. చిలకమర్తి గారి పాడి ఆవు అనాధ అయిపోవడ...

కాంత - అన్యాక్రాంత - కౌంతేయ

కోరిక సుడిగాలై  పాకింది నరాలలో విజయుడి బహుమతి కైవసం చేసుకున్న తొలి రేయిలో. అపుడేమైంది పాంచాలీ జగన్మోహినన్న నీ గర్వానికి నేనూ విజేతనే తెర మరుగున అన్న ఆ మగతనానికి? ఊపిరిసల్పనీయలేదా నిన్ను పశ్చాత్తాపం లేని బాహువులతో నైపుణ్యంగా తానే గెలుచుకున్నట్లు నిన్ను, స్వహస్తాలతో? నీ హొయలలో మోహం మాటు అయ్యిందా అతని క్రింద నీ నడుము ఒలలూగినప్పుడు? ఆ కేళిలో, వాడి వేడిలో చలించి అకస్మాత్తుగా సెగలు బూడిదై, నిట్టూర్పుతో అతను కృంగిపోగా యవ్వన సంభోగలోలమైన నీ ఓజస్సులో సుఖభంగాన్ని కప్పిబుచ్చే సంయమనం దాగిందా? గదాధారుడు కాదు, ధనుష్టంకారం చేయలేడు కానీ యెనలేని అహంకారాన్ని త్యజించలేని ధీరుడాతడు. --- Free translation of a sonnet from  "Yuddhistira & Draupadi" by Pavan Varma. Inspired by Gulzar's translation to Hindi