Posts

స్వప్నదర్శనము

  డా. లంకా సత్యనారాయణ  రచించిన   Vision (  Vennela Gangotri)   కి స్వేచ్ఛానువాదం...   అగమ్య గోచరమైన జీవనంలో, మసకబారిన కనులతో శోకతప్త భాష్పాలు కారని మనిషి ఎవడైనా ఉన్నాడా? కొండలలో కానలలో, జన సమూహంలో నిర్జిత ఎడారిలో వెతికాను వృధాగా. ఎచట చూసినా కన్నీటి ధారలతో తడిసి ముద్దైన మానవులే, ఎటు చూసినా నాకు కనపడేది జన సందోహం, బాధల భారంతో కాళ్ళు ఈడుస్తూ బ్రతుకు బరువు మోస్తూ. అన్నీ దిక్కులా కన్నాను దిక్కు తోచని మనుషులు విన్నాను శృతి మించిన పాటలు, గతి తప్పిన గీతాలు, తడబడే అడుగులు. ఓ భగవంత! నీ ప్రేమ సౌధం చేరాలని మనిషిని ఇలా సృజించావా? ఎంతో విడ్డురంగా స్వప్నాలలో అవధులు లేని విశ్వ సౌందర్యం జాలు వారగ మనిషి ప్రభాత భాస్కరుని తేజాన్ని రాగాలలో పులుముకున్నాడు యెడతెగని తన యానం వెలుగుల బాట అవ్వాలని. నువ్వేనా మా నుదుట ఈ వ్రాత రాసింది? చెప్పగలవా మా విధి ఈ విధంగా ఎందుకు మలచావో? ఓ భగవంత! ఎందుకు ఈ ప్రపంచాన్ని ఇంత మనోహరంగా సృష్టించి మనిషిని కోరికల అగ్ని కీలలలోకి నెట్టేసావు? అంతులేని అంతుచిక్కని అజ్ఞాత దూర తీరాలకు కొట్టుకుపోయాడు మనిషి, కడతేరని తీరని ఆశల అలల కడలిలో. తెగిన వీణా తంత్రులు తిరిగి...

మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు

  కైఫీ అజ్మి  రచించిన   Aurat   కి స్వేచ్ఛానువాదం...   మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు యుద్ధ జ్వాలలు రగులుతున్నాయి ప్రపంచంలో నేడు నుదుటి రాతలూ, కాలం పరుగులు, కలిసి పంచుకున్నాయి ఒకే ఆశలు నేడు మదిర పాత్రలో మధువు మరుగుతోంది అగ్నిపర్వతంలా నేడు సౌందర్యము ప్రేమము ఒకే ప్రాణం ఒకే ఆత్మ అయ్యే నేడు ఏ అగ్ని జ్వాలలలో నేను తప్తమవుతున్నానో తప్తమవ్వాలి నువ్వు మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు జీవితం పోరాటంలో ఉంది, ఓర్పుల నిగ్రహంలో కాదు పరవళ్లు తొక్కే బ్రతుకు రక్తంలో ఉంది, బెదిరిన కన్నీటిలో కాదు చేతులు చాచి ఎగరడంలో గుబాళింపు ఉంది, నీ నల్లని కురులలో కాదు స్వర్గం వేరొకటి ఉంది, మగని పక్కన కాదు ఆ స్వతంత్రపు వీధులలో స్వేచ్ఛగా విహరించాలి నువ్వు మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు దిక్కు దిక్కునా చితాగ్నులు మండుతున్నాయి నీ కోసం కర్తవ్యం అన్న ముసుగులో మృత్యువు మసులుతోంది నీ కోసం దయతో కోమలంగా నువ్వు చేసే పనులన్నీ, అవుతాయి శాపం నీ కోసం కాలకూటపు విషం, అవుతాయి ప్రపంచపు గాలులు నీ కోసం ఋతువునే మార్చేయ్యి, ఎదగాలంటే విప్పరాలంటే నువ్వు మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వ...

కార్తీక మాసం - నా గురుతులు

  న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్, న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్ స్కంద పురాణంలోనిది ఈ శ్లోకం. కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు. దీపావళి అయిన మరునాడే మొదలయ్యే కార్తీక మాసానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? కార్తీక పురాణం స్వయాన విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమేశ్వరుడు పార్వతీదేవికి, బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడని నమ్మకం. వసిష్ఠుడు రాజయోగి అయిన జనక మహారాజుకు చెప్పగా, అయన ఆచరించి లోకులకు తెలియజేసాడని ప్రతీతి. ఎంతో ఉత్సాహంగా, సామూహిక సంబరాలతో కనులవిందుగా జరిగే నవరాత్రులు, దీపావళి తరువాత, నిష్ఠతో అంతర్దృష్టులై ఆడంబరాలు వదిలి లోకేశుని ధ్యానంలో గడపటానికే కార్తీక మాసం అని మా నాన్నగారు చెప్పేవారు. అయన చిన్నతనం అంతా గోదారి గట్టున, కోనసీమలోని తొండవరం అనే కుగ్రామంలో గడిపారు. వారి తండ్రి (మా తాతగారు) ప్రతీ దినం గోదావరి మట్టితో పార్థివ లింగం చేసి అభిషేకించి తిరిగి నదిలోనే కలిపేవారట. పంచభూతాల మిశ్రమం ఈ మట్టి ఈ భూమి. తరతరాలుగా, యుగ యుగాలుగా ప్రవహించేవి మన జీవనదులు. వాటి పంచన కోటానుకోట్ల జీవ...

పోల్చనా నిన్ను వైశాఖపు వేసవి రోజుతో?

  విలియం షేక్‌స్పియర్  రచించిన సొన్నెట్ 18    Shall I compare thee to a summers day  కి స్వేచ్ఛానువాదం...       పోల్చనా నిన్ను వైశాఖపు వేసవి రోజుతో?     దానికంటే మధురం దానికంటే మృదు మరువం నువ్వు:     మరులుగొల్పే మల్లెలు వాడి వేసారు వడ గాలి సెగలతో,     వసంత కాలపు రోజులు వడివడిగా సాగి కనుమరుగవ్వు:     గగనవీధిలో వెలిగే నేత్రం వేసవిలో మంటలురేపే మధ్యాహ్నం,     సువర్ణరేఖల భానుడు మబ్బుల మాటున చేరి దోబూచులాడెను అపుడపుడూ;     సృష్టిలో ప్రతీ అందం కాలానికి ఒగ్గును శిరం, తప్పదు దాని పతనం,     ప్రకృతి ధర్మం అది, చెరగని నిజం అది, తరతరాల ఈ శృంఖల ఆగదు ఎపుడూ :     కానీ నీ నిరంతర వసంతోత్సవం  వాడదు ఎన్నటికి,     భువినుండి పునికి పుచ్చుకున్న నీ సౌందర్యం ఇక  చేజారదు:      డాంబికాలు పలుక తరమా, నల్లని తన నీడ నిను తాకుతుందని, మృత్యువుకి        అజరామరమైన ఈ పంక్తులలో నీ లావణ్యం కలకాలం ఎదుగుతుండగా:     మనిషి ఊపిరి తీసుకునేంతవరకు, క...

వేలకొద్ది ఆశలు అలాటివి

  గాలిబ్  (1797 - 1869)  రచించిన ఘజల్    హజారోన్ క్వాహిషే ఏసీ   కి స్వేచ్ఛానువాదం...        వేలకొద్ది ఆశలు అలాటివి,  ప్రతీ ఆశకై అది తుది శ్వాస  అయ్యింది     ఎన్నో తీరాయి నా కోరికలు అయినా తిరిగి కొంత తక్కువ అయ్యింది     భయం ఎందుకు ప్రియ ఘాతి, ఇంక ఏముంటుంది నా కంఠంలో     ఆ రక్తం ధారలుగా ప్రతి రోజూ ప్రతి ఊపిరిలో కన్నీరు అయ్యింది     కూడబెట్టిన పుణ్యం నిండుకుంటే, తిరిగి మానవ జన్మే, వింటూనే ఉన్నాం ఇదేదో     కాలరాసే అవమానాలు క్రమ్ముకుంటే నీ వీధిలో నా బ్రతుకు చీకటి అయ్యింది     అందనంత ఎత్తులో ఉన్నావని విర్రవీగకు, నేల జారగలవు త్రుటిలో       కొప్పు ముడి వీడినంతనే అందాల నీ కురుల నిడివి తెల్లము అయ్యింది     అయినా తనకి లేఖ వ్రాయాలంటే ఎవరైనా, వ్రాయించుకోండి నాతో     ప్రొద్దు పొడుస్తూనే కలం చెవిలో పెట్టుకుని బయలుదేరడం అయ్యింది     మధువు తాగుతానని పేరుబడింది నాకు, ఈ ఝాములో ఈ ఊరులో     మళ్ళీ లోకంలో సురామృత కలశం మధించే  స...

మట్టి

   టి ఎస్ ఎలియట్ (1888 - 1965)  రచించిన కవిత    ది రాక్ (1934)   కి స్వేచ్ఛానువాదం...        గగన సీమలలో పక్షిరాజు పైకెగిసింది     వేటగాడు జాగిలాలతో పాటు సంచారం చేస్తున్నాడు     ఓ చుక్కల నిత్య భ్రమణమా     ఓ ఋతువుల నిర్ధేశిత పునరావృతమా     ఓ వసంత శిశిరాల, జనన మరణాల ప్రపంచమా     అంతులేని వలయం ఈ తలపు ఈ కర్మ,     అంతులేని కల్పన, అంతులేని శోధన,  తెస్తాయి     ఎరుక చలనాల గూర్చి, కానీ అందదు నిశ్చలత్వం     ఇస్తాయి వాగ్విద్య, కానీ  వినబడదు నిశ్శబ్దంలో నిర్దేశం     మాటల అర్థం అందుతుంది, కానీ శృతి తెలియని అజ్ఞానం మిగులుస్తుంది     మన విషయ జ్ఞానం మనల్ని మరింత దరికి చేరుస్తుంది అజ్ఞానానికి     మన అజ్ఞానం మరలుస్తుంది మర్త్యుని దగ్గరకు     మృత్యువు వడి లోకేగాని, బ్రహ్మైక్య ఆనందంలోకి కాదు.     ఎక్కడా జీవితం బ్రతకడంలో ఖర్చు అయిపోయినది ?      ఎక్కడ ఆ వివేకం, శాస్త్ర పరిజ్ఞానంలో కోల్పోయినది ?    ...

మేరు

  ఐరిష్ కవి  విలియం బట్లర్ యేట్స్ (1865 - 1939) రచించిన కవిత    మేరు (1934)   కి స్వేచ్ఛానువాదం...        నాగరికత పెనవేసుకు పోయింది, లోబడి     ఒక శాసనానికి, శాంతి అనే ఓ ఆకృతికి,     వన్నె వన్నెగా భిన్న భిన్నంగా అల్లుకుపోయిన మాయకి; తలపుల వడి     మనిషి జీవితం, భయంతో భీతిల్లినా మనిషి ఆపలేడు     మారణహోమం, యేళ్లు శతాబ్దాలు అయినా  శతాబ్దాలు యుగాలైనా     శమించని ఆకలితో ప్రళయ తాండవం చేస్తో, సర్వ విధ్వంసం కావిస్తో వచ్చేది     ఎడారి వంటి వినాశనమైన వాస్తవంలోకే:     ఈజిప్టు మరియు గ్రీకు రాజ్యాలకు వీడ్కోలు, వీడ్కోలు రోమ్ మహాసామ్రాజ్యానికి.     ఋషులు మేరు పర్వతం పైన, యోగులు హిమాలయాల్లో     మంచు కప్పిన ఆ గుహల్లో, ఎముకలు కొరికే శీతాకాలపు హిమ పాతం     తమ నగ్న శరీరాలను చాకుల్లా తాకుతున్నా, వారికీ తెలుసు     పగటి వెంబడే చీకటి వస్తుందని, ఉషోదయానికి ముందే     మనిషి యొక్క ప్రశస్తి మనిషి కట్టిన సౌధాలు తృటిలో బూడిదై పోతాయని.

సెలయేరు కలిసింది కృష్ణమ్మలో

అనోఖీ రాత్ చిత్రంలో ఇందీవర్ రచించిన గీతం    ओह रे, ताल मिले नदी के जल में     కి స్వేచ్ఛానువాదం... ఓ ఓడమాలి, తీరం కానదేమోయి సెలయేరు కలిసింది కృష్ణమ్మలో, కృష్ణమ్మ కలిసింది ఆ కడలిలో కడలి కడకి కలిసేది ఏ నీటిలో ఏ నీటిలో, తెలియలేదే ఎవ్వరికీ సూరీడు కోసం భూమమ్మ ఎదురు సూస్తాది నేల తల్లికోసం సెందురూడు కాపు కాస్తాడు సెందురూడు కాపు కాస్తాడు నీటనున్న నత్తగుల్ల వలే ఆ…. నీటనున్న నత్త వలే ప్రతి హుదయానికి దప్పికే ఆ… దప్పికే ఓ నేస్తమా ఓ… నీటనున్న నత్తగుల్ల వలే ప్రతి హుదయానికి దప్పికే సుక్క యే మబ్బున దాగుందో ఎవడికి ఎరుకా, ఎవడికి యెరుక ఓ ఓడమాలి, తీరం కానదేమోయి సెలయేరు కలిసింది కృష్ణమ్మలో, కృష్ణమ్మ కలిసింది ఆ కడలిలో కడలి కడకి కలిసేది ఏ నీటిలో ఏ నీటిలో, తెలియలేదే ఎవ్వరికీ తెలియని పెదాల పైన తెలిసిన పాటలెందుకో తెలిసిన పాటలెందుకో నిన్నటిదాకా తెలియనివారు, జనమ జనమాల జోడు నేడు జనమ జనమాల జోడు నేడు ఓ నేస్తమా ఓ… నిన్నటిదాకా తెలియనివారు, జనమ జనమాల జోడు నేడు యే నిమిసాన యేమి జరుగుతాదో యెవరికి తెలుసు యెవరికి తెలుసు ఓ ఓడమాలి, తీరం కానదేమోయి సెలయేరు కలిసింది కృష్ణమ్మలో, కృష్ణమ్మ కలిసింది ఆ కడలిలో కడలి...

ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా

బందిని చిత్రంలో శైలేంద్ర రచించిన గీతం    अब के बरस भेज भैया को बाबुल     కి స్వేచ్ఛానువాదం... ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా శ్రావణం పిలుస్తోంది తీపిగా నన్ను వెనుకకి వచ్చినప్పుడు నా చిన్ననాటి స్నేహితులు పంపవా చల్లని కబురు నాకు ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా గున్న మామిడి తోటలో మళ్ళీ ఊగుతాయి ఊయలలు చిటపట చినుకులు తడుపుతాయి మళ్ళీ చిరు జల్లులు తిరిగి వస్తాయి మీ వాకిట్లో నాన్నా శ్రావణ మేఘాల చల్ల గాలులు కళ్ళలో నీరు తిరిగేనే పాశం ఇంటికి లాగేనే చిన్ననాటి గురుతులు మనసున మరలినంతనే ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా రాకాసి యవ్వనం తీసుకుపోయింది ఆటల ఆస్తులని రంగు రంగుల బొమ్మలు నావి కాజేసుకు వెళ్లింది నీ గారాల పట్టీ నేను కదా నాన్నా మరెందుకు అయ్యాను ఇప్పుడు పరాయి నేను కాలాలు గడిసిపోయాయి జాబులు మాత్రం రావు రాలేదు ఎదురు చూసినా నావారు ఎవరూ ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా శ్రావణం పిలుస్తోంది తీపిగా నన్ను వెనుకకి వచ్చినప్పుడు నా చిన్ననాటి స్నేహితులు పంపవా చల్లని కబురు నాకు ఈ ఏడాది పంపవా తమ్ముడిని నాన్నా -- పవన్ చిట్టాప్రగడ

ఊపిరి

  బెకీ హెంస్లీ      Breathe     కి స్వేచ్ఛానువాదం... మరుగున ఉంటే నీకు బిడియమన్నారు ముందుకు వస్తే నీకు గర్వమన్నారు అడుగుతారు దారి కానీ విని తల దూర్చకన్నారు నీ గొంతు పెద్దదన్నారు కానీ గమ్మునుంటే నివ్వెరపోయారు లేదు వాంఛ అంటే అయ్యో పాపం అన్నారు కలలు పంచుకుంటే పిచ్చిదానివన్నారు చెప్పు వింటామన్నారు విని చెవులు మూసుకున్నారు భయమంటే హత్తుకున్నారు వెనుతిరిగి ఫక్కున నవ్వుకున్నారు అన్న మాటలన్నీ విన్నది, విన్న చిన్నది తాననుకున్నది వాళ్ళు గీసిన అమ్మాయవ్వాలని, ఆ ఉత్తమ స్త్రీ వారనుకున్నది ఒకనాటి మహోదయాన గుండెసవ్వడి అడిగింది నాకేది శ్రేష్ఠమని చాలు చెలి  ఇక సంతృప్తి పరచడం  మరి  అందరిని వేగిరమే పయనమై కానలకి, చెట్ల నడిలో నుంచుంది ఆకులతో చిరుగాలి గుసగుసలు వింది రెపరెపలాడే కేళి చూసింది మద్దితో మాట్లాడింది కదళితో కబుర్లాడింది పున్నాగని పలకరించింది ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి వసంతం ప్రతి శిశిరం అందరూ చెప్పిన నిర్దేశాలు వినిపించింది జీవితాన ప్రతీ క్షణాన నాలో ఎపుడూ లేమి నాలోనే ఎదో లోపం నా ఉనికి ఒకరికి మరీ తక్కువ లేకపోతే అంతెందుకు మరీ ఎక్కువ ఒకసారి స్థాయి ఎక్కువ కాకప...

తల కొంతగా వంచితే రాయి కూడా దేవతై పోతుంది

బషీర్ బద్ర్    सर झुकाओगे तो पत्थर देवता हो जाएगा     కి స్వేచ్ఛానువాదం... తల కొంతగా వంచితే రాయి కూడా దేవతై పోతుంది తన నంతగా ప్రేమించకు తను వంచకై పోతుంది నేనూ నదినే నా గతి శృతి నాకు తెలుసు ఏ వైపుకు వెళితే అదే తుళ్ళి తుళ్ళి దారై పోతుంది ఎంతో నిజాయతీతో జీవితం నాతో అంది నువ్వు నాకు కాకపోతే మరొకరితో  నాకు  ముడై పోతుంది పై వాడి మీద భారం వేసి తాగుతున్నాను మిత్రమా హాలాహలం ఉన్నా ఇందులో ఔషధమై పోతుంది అన్నీ తనవే గాలి పరిమళం నేల నీలాకాశం నేను ఎటు వెళ్లినా ఎక్కడికి వెళ్లినా తనకి తేట తెల్లమై పోతుంది

మనసా నందమా నంద మాయే

Image
  Man Anand Anand Chayo   కి స్వేచ్ఛనువాదం... మనసా నందమా నంద మాయే కడతేరగా గగనాన ఘనాంధకారం విప్పారిన కనుల సూరీడాయే మనసా నందమా నంద మాయే ఎగిసే అలల అందాల కిరణాలు గంగమ్మ ఒడిలోని పవిత్ర జలాలు అర్పించు వేళ ప్రతి సింగారం తేనెలొలుకు సింధూర గీతమై పాడెనే మనసా నందమా నంద మాయే మనసున పేరుకున్న పుట్టెడంత చింతలు కరిగి కన్నీళ్ళై చేతిన వర్షించగా అశృతుషారాలతో బిక్కు బిక్కు నున్న ప్రతి రోమము రొమ్ము విప్పి నవ్వేనే మనసా నందమా నంద మాయే మానస సరోవరం కల్లోల మగ్నం నవదర్పణం తొంగి చూడగా పాశం నాశం లేనిదై  అర్థనిమీలిత నేత్రాలతో ప్రాణ హంస తరలి వచ్చెనే మనసా నందమా నంద మాయే

పలు మార్లు ఇదీ చూసాం

Kai Baar Yun Bhi Dekha Hai / कई बार यूँ भी देखा है   కి స్వేచ్ఛనువాదం... పలు మార్లు ఇదీ చూసాం ఈ మనసు కున్న సరిహద్దూ మనసు దాటుతూ ఉంటుందీ తానెరుగని దాహం కోసం తానెరుగని ఆశల కోసం మది పరిగెడుతూ ఉంటుంది దారుల్లో, రహ దారుల్లో బ్రతికేటి దారుల్లో విప్పారే పూలు, పూలు మందారాలై ఏ పూవు తీసుకోవాలో హృదయంలో కొలవాలో యేమిటో యేమిటేమిటో ఈ చింతా యేమిటో తీర్చేది ఎట్లో తెలీక సతమతమౌనే ఎవరిని వరి ఇంచను ఎవరి ప్రేమ మరపించను

ఘడియలు చెప్పే గడియారంలో గంటలు గణించినపుడు

  ఘడియలు చెప్పే గడియారంలో గంటలు గణించినపుడు షేక్స్పియర్     Sonnet 12: When I do count the clock that tells the time   కి స్వేచ్ఛనువాదం... ఘడియలు చెప్పే గడియారంలో గంటలు గణించినపుడు, గండ్రగొడ్డలి వంటి పగలు కళ్లు కప్పి మాయమయ్యె కరాళ రాత్రియై; సువాసనలు విరిసే మల్లెతీగలు వడిలి హొయలు బాసినపుడు, కాలనాగు వంటి నల్లటి కురులు మెరవగా ముగ్గువలె ధవళమై; మహోన్నత వృక్షాలు ఆకులు రాలి మోడుగా అగుపడిన కారులో అవేకాదా నిరుడు మండుటెండలో మందలకి గొడుగుగా నీడనిచ్చాయి,  వసంతాల సరివన్నెల పచ్చిక ముడుచుకుని మూటైనపుడు పైరులో గడ్డ మంచు కౌగిలిలో కటుకపై తెల్లని ముసుగై మరీ నిల్చాయి, అప్పుడు స్ఫురించింది ఈ ప్రశ్న అహో నీ అందం కాలం చేసే లయవిన్యాసంలో అంతం అవ్వక తప్పదు కదా, ప్రేయసీ ప్రియులు తమను తాము త్యాగం చేసే అనుబంధం వలపుల పంట అంతకు అంత అవ్వగా తాము సమసిపోతారు గదా;     కాలపు కొడవలి కోత నుంచి లేదు జగాన కాపాడే  యే  కవచం,     కొత్త తరం తక్క, నూకలు తీరిననాడు ఎగిరిపోవడం తథ్యం ఈ వచం

నూతన సంవత్సరోదయం

  నూతన సంవత్సరోదయం           హెలెన్ హంట్ జాక్సన్ (1830 - 1885)     New years morning  అని 1892 లో రాసిన పద్యంలోని రెండవ చరణానికి స్వేచ్ఛనువాదం...     ప్రతీ రాత్రి నిన్న నుంచి రేపటికి!     రాత్రి అల సొలసిన మేనులకు సల్లని నిదురుల రేయి!     ప్రతి ఉదయం నిజమైన నూతన సంవత్సరోదయం,     నిఖిలమైన పండగల ఆర్ణవం.     ప్రతి రేత్రి చేయాలి పవిత్ర ధాత్రి     అహము బాసి దీక్షబూని భక్తి శ్రద్ధలతో;     ప్రతి దినం మహోన్నత ముహూర్తమే కన్ను తెరిచి కదిలి పోడానికి     సరికొత్త ఆహ్లాదం ఈ వెచ్చని గాలిలో ఆ పచ్చికపైరులో.     కేవలం ఒక రాత్రి పాత నుంచి కొత్తకి;     కేవలం ఒకే నిద్దర నెలరాజు నుండి సూరీడుకు.     కొత్తదనం కాదా పాతల కలల సాకారం;     ప్రతి ఉషోదయం సరికొత్త యుగానికి ఆకారం.

బిమల్ రాయ్

బిమల్ రాయ్ ("ప్రత్యక్షంగా...వారిని కలిసాను", గుల్జార్ గుర్తులు నుండి అనువాదం) నిజం చెప్పాలంటే పంజాబీ కుటుంబంలో పుట్టినా నేను పంజాబీను ఎంతో బెంగాలీను కూడా అంతే. ఎనిమిదో  తరగతిలో ఉండగా ఠాగోర్ నన్ను ఆవహించాడు, కాదు కాదు నేనే ఆయన్ని  పెనవేసుకున్నాను. అప్పటినుంచి ఖచ్చితంగా చెప్పలేను బెంగాలీ నాలో ఇమిడిపోయిందో లేక నేను బెంగాలీలో మునిగిపోయానో. పదోతరగతి అయ్యేప్పటికి ఠాగోర్, శరత్ చంద్ర చట్టోపాధ్యాయ, బంకించంద్ర చట్టోపాధ్యాయ సాహిత్యం ఉర్దూ అనువాదంలో పరిచయం అయ్యింది.  బెంగాలీ స్నేహితులు బడిలో సంభాషించుకోవడం విని నేనూ నేర్చుకోవాలని ఉవ్విళ్లూరాను. నేర్చుకున్నాను. తోడుగా సాహిత్య పఠనంలో అడుగులు వేస్తూవచ్చాను. షుమారు ఈ కాలంలోనే అనుకుంటా రచయత అవ్వాలనే కోరిక నాలో నాటుకో సాగింది. సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఉండగా ముంబాయి (అప్పట్లో బొంబాయి) లో ఉన్న మా పెద్ద అన్నయ్య దగ్గరకి నన్ను పంపించారు. బహుశా జీవితం పనికిరాని వాటితో వృధా చేయకుండా బ్రతుకుతెరువు నేర్చుకోవడం కోసం పంపించారు అనుకుంటా. అదే నా యందు ఒక వరమయ్యింది. బొంబాయి వెళ్ళగానే ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ (అభ్యుదయ రచయితల సంఘం) లో, ఇంకా ఇండి...

ఒకనాడీ భువి సకలము

  ఒకనాడీ భువి సకలము             - దేవులపల్లి కృష్ణ శాస్త్రి                -తాత్పర్యంలో మరియు ఆంగ్ల అనువాదంలో తప్పులు మీ విధేయుడివి ఒకనాడీ భువి సకలము స్వర్గము సుకముల సొగసుల సునారామము వికచ విభాత శుభముల దామము ప్రకట యశోవిలసితము స్వతంత్రము కులముల మతముల కూడని ఈసుల అలసత కృపణత అలమిన మనసుల ఖల పరపన్నగ గాడ విషానలా విలమై, ఖలమై అలమెను దాస్యము భువి = భూమి సుకము = సుఖము సునారామము = సు + ఆరామము ఆరామము = ఉద్యానవనం, తోట వికచ = వికసించునది విభాత = ప్రభాతం, వేకువ దామము = హారము, దండ, పలుపు త్రాడు ప్రకట = స్పష్టముగా కనపడుట, ప్రసిద్ధమైనది యశము = కీర్తి  విలసితము = ప్రకాశింపబడినది కూడని = తప్పైన, సరి కాని ఈసులు = చెదలు, రెక్క పురుగులు అలసత = ఆలస్యం, సోమరితనం, జడత్వం కృపణత = నీచం, మూర్ఖత్వం అలమిన = వ్యాపించిన, ఆక్రమించిన ఖల = దుష్టుడు, పాపం, ధర్మం వదిలిన వాడు పర = శత్రువు; చంపుటకు సిద్ధమైన పన్నగ = పాము గాడ = గాఢ = దట్టమైన, ధృడమైన విషానల = విష + అనల విష = విషం అనల = అగ్ని విలము = కప్పునది, గుహ, బిలము దాస్యము = ఊడిగము ఒకప్పుడు స...

SARASWATAM: హృద్యం-తెనుగు పద్యం 6 ( సిద్ధాంతమేదైన నా రక్షణ బా...

SARASWATAM: హృద్యం-తెనుగు పద్యం 6 ( సిద్ధాంతమేదైన నా రక్షణ బా... :     హృద్యం-తెనుగు పద్యం 6 ( సిద్ధాంతమేదైన నా రక్షణ బాధ్యతనీదే )                                               డాక్టర్ . చిలకమర్తి దుర్గా...

నెయ్యములల్లో నేరేళ్ళో

నెయ్యములల్లో నేరేళ్ళో   -- అన్నమాచార్య కీర్తన  -- క్రింద తాత్పర్యంలో తప్పులు ఉంటే క్షమించి తప్పు సవరించగలరు.   పల్లవి: నెయ్యములల్లో నేరేళ్ళో వొయ్యన వూరెడి వువ్విళ్ళో చరణములు: పలచని చెమటల బాహుమూలముల చెలమలలోనాఁ జెలువములే థళథళమను ముత్యపుఁ జెఱఁగు సురటి దులిపేటి నీళ్ళ తుంపుళ్ళో తొటతొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ చిటి పొటి యలుకల చిరునగవే వట ఫలంబు నీ వన్నెల మోవికి గుటకల లోనా గుగ్గిళ్ళో గరగరికల వేంకటపతి కౌఁగిట పరిమళములలో బచ్చనలు (లే) మరునివింటి కమ్మనియంప విరుల గురితాఁకు లినుప గుగ్గిళ్ళో కష్టమైనా పదాలకు అర్ధాలు: నెయ్యము = స్నేహము, ప్రేమ, ఇంపు అల్లో నేరేళ్ళు = కాముని పున్నమికి స్త్రీలు ఆడే కోలాటం ఒయ్యన = నెమ్మదిగా, వయ్యారంగా  చెలమ = ఊట; తవ్వబడిన పల్లము చెలువము = అందము చెరగు = అంచు; కొంగు సురటి = విసిన కఱ్ఱ తొరుగు = ప్రవహించు; కారు; పడు నగవు = నవ్వు వట = మఱ్ఱి చెట్టు వన్నె = రంగు, అందము మోవి = పెదవి గరగరికల = చక్కదనం; అందం బచ్చన = పూత; పూయడం మరుడు = మన్మథుడు వింటి = విల్లు కమ్మని = ఆహ్లాదకరమైన; తీపి అంప = బాణము విరి = పుష్పము; వికసించినది తాత్పర్యము అన్నమయ్య ఊహించిన గొప్ప శృంగార దృ...

ఓ విభావరీ! ఓహో విభావరీ!

ఓ విభావరీ! ఓహో విభావరీ!             -  డా.బాలాంత్రపు రజనీకాంతరావు                -తాత్పర్యంలో మరియు ఆంగ్ల అనువాదంలో తప్పులు మీ విధేయుడివి ఓ విభావరీ! ఓహో విభావరీ! నీహార హీర నీలాంబర ధారిణీ, మనోహారిణీ!! నీ చంచల చేలాంచల నిభృత స్వప్న సీమలలో ఏలా భయచ్ఛాయాజాల మేలా సౌఖ్యరోచిర్లీల!! ఓ విభావరీ! ఓహో విభావరీ!! సంతత శాంతతరంగిణి మదభరయువకురంగిణి ఏలా యలసగమనమ్ము ఏలా నవవిలసనమ్ము!! ఓ విభావరీ! ఓహో విభావరీ!! ధరణీతలచంద్రశిలా తరళమంటపమున నిలిచి యుగములుగ పరిభ్రమింతు నగమ్యుడౌ యెవని వలచి!! ఓ విభావరీ! ఓహో విభావరీ!! కవి రాత్రి గురించి వర్ణిస్తున్నారు. విభావరి, తెల్లటి మంచు రత్నంలా ఉంది నీమీద. చీకటిని నల్లటి చీర లాగా ధరించావు, మనసు దోచావు. రెపరెపలాడే నీ కోక అంచులలో నిశ్చలమైన కలల సామ్రాజ్యం ఉంది. సుఖమయ కాంతులు వెదజల్లే ఆ చోట మరింకెందుకు ఆ భయం? ఓ రేయి, నిరంతరం పారే శాంతమైన నదివి నీవు. మదోన్మత్తమైన వయసులో ఉన్న జింకవి నీవు. అయినా ఎందుకు ఈ వడిలేని అడుగులు? ఏంటీ క్రొత్త కేళి? ఓ నిశా వనితా, చంద్రునికాంతిలో మెరిసిపోయే భూమి అనే రత్న మంటపం మీద నిలబ...